తన కుక్కను ఛార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్లిన విజయ్ దేవరకొండ.. నెట్టింట్లో ట్రోల్!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సెలబ్రెటీలు స్పెషల్ ఫ్లైట్స్ ని వినియోగించుకుంటున్నారు.ఆడియో ఫంక్షన్ లకి, సక్సెస్ మీట్ లకి ఎక్కువగా వారి స్పెషల్ ఫైట్స్ ని వినియోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్క ని ఫ్లైట్ తీసుకెళ్తున్నాడు.

 Vijay Deverakonda Plane Ride With His Smart, Vijay Devarakonda, Flight, Dog, Vir-TeluguStop.com

అందుకు సంబంధించిన వీడియోని దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.అయితే ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో పలువురు ప్రముఖులు వారితో పాటు తోటి సహచరులను, అదేవిధంగా స్టాప్ ని తీసుకెళ్లడం చూశాం.

కానీ మొదటిసారిగా ఫ్లైట్ లో తనతోపాటు కుక్కను తీసుకెళ్లిన నటుడు విజయ్ దేవరకొండ అని చెప్పవచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇకపోతే హాలీవుడ్ లో ఇలా తమ పెంపుడు జంతువులను తీసుకెళ్ళడం అన్నది సాధారణమైన విషయం.ఆ చార్టెడ్ ఫ్లైట్ సంస్కృతి కాస్త హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కీ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి చేరుకుంది.

ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలా కుక్కలను ఏ సెలబ్రిటీ కూడా తీసుకెళ్లలేదు.కానీ మొదటిసారిగా ఇలాంటి సాహసం చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.ఇలా నిరంతరం అందరి కంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు రౌడీ హీరో.ఈ నేపథ్యంలోనే కరోనా సమయంలో ముందుకు వచ్చి దేవర శాంటా అన్న పేరుతో 100 మంది కి పదివేలు చొప్పున ఇచ్చాడు.

ఈ వీడియో పై కొందరు నెటిజెన్స్ పాజిటివ్ గా స్పందించగా, ఇంకొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.కొంతమంది నెటిజన్స్ స్పందిస్తూ.

ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఇటువంటివి అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొంతమంది దానికి పెట్టిన ఖర్చుతో ఎంతోమంది పేద వారిని ఆదుకోవచ్చు.డబ్బు నీ మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కొందరు అయితే పెంపుడు కుక్కను ఫ్లైట్ ఎక్కించడం లో తప్పులేదు కానీ.

సోషల్ మీడియాలో ఆ వీడియోని పెట్టి సరదా పడటం ఏం బాగోలేదు అని కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube