నాపై ట్రోల్స్ కూడా నాకు ఇష్టమే.. విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.అర్జున్ రెడ్డి సినిమా తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్.

 Vijay Deverakonda Likes Trolls Social Media-TeluguStop.com

వరుస సినిమాలతో అవకాశాలు అందుకున్నాడు.ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న విజయ్.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు విజయ్.

 Vijay Deverakonda Likes Trolls Social Media-నాపై ట్రోల్స్ కూడా నాకు ఇష్టమే.. విజయ్ దేవరకొండ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


ఇదిలా ఉంటే మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా లైగర్ టీజర్ విడుదల చేయడానికి ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల టీజర్ వాయిదా పడింది.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది.

ఈ సినిమాకు ప్రముఖ నిర్మాతలు కరణ్ జోహార్, టాలీవుడ్ నటి చార్మి నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరగనుండగా.

ప్రస్తుతం ముంబైలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ.తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అందరి సెలబ్రేట్ ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.అంతేకాకుండా సినిమా విడుదల కంటే ముందు వేడుకలలో తనదైన శైలిలో మాట్లాడుతూ కొందరిని ఆకట్టుకుంటాడు.

మరి కొందరిని నొప్పిస్తుంటాడు.


ఇక వాటి ప్రభావం సోషల్ మీడియాలో చూపిస్తుంటారని అలా రకరకాల ట్రోల్స్ వస్తుంటాయని.

గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.ఇక వాటికి తనపై చేసే విమర్శల్ని కూడా తాను ఇష్టపడతాడట‌.

ఎందుకంటే ఓ వ్యక్తి తనను ఎంతగా ఇష్టపడితే ట్రోల్ చేస్తాడో కదా అంటూ తనదైన శైలితో సమాధానం ఇచ్చాడు.పైగా అవి రొటీన్ గా ఉంటే మాత్రం పట్టించుకోనని తెలిపాడు.

#Corona #Social Media #Trolls #Liger #TrollsOn

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు