ఫైటర్ కోసం కష్టపడుతున్న రౌడీ స్టార్... పూరీ ఇన్స్పైర్

రౌడీ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ.స్టార్ హీరోల రేంజ్ లో ఫేమ్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.

 Vijay Deverakonda Hits The Gym To Flaunt Six-packs, Tollywood, Telugu Cinema, Pu-TeluguStop.com

ఛార్మి, కరణ్ జోహార్ నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇక లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, మలయాళీ స్టార్ సురేష్ గోపి, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇప్పటి వరకు పెద్దగా ఫైట్స్ చేయని విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు.అందుకోసం తన లుక్, బాడీ లాంగ్వేజ్ కి పూర్తిగా మార్చుకుంటున్నాడు.

దానికోసం ఎక్కువగా జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడు.

ఇప్పటి వరకు సింపుల్ కథలతో సాలిడ్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ చేసిన పాత్రలు అన్ని కూడా మన చుట్టూ సమాజంలో ఎవరో ఒకరిని ప్రతిబింభించే విధంగా ఉన్నవే.అయితే ఈ సారి మాత్రం పూరి స్టైల్ లో మాస్ హీరోగా ఫైటర్ సినిమాలో కనిపించబోతున్నాడు.ఈ సినిమాతో తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్న వీడియోని షేర్ చేశాడు.ఈ వీడియోని పూరి జగన్నాథ్ షేర్ చేసి ఆసక్తికరమైన కామెంట్స్ పెట్టాడు.

ద‌టీజ్ మై హీరో, ద‌టీజ్ మై ఫైట‌ర్.నువ్వు న‌న్ను గ‌ర్వ‌ప‌డేలా చేశావ్‌.

లవ్ యూ విజ‌య్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు.ఇక ఫైటర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ చేయడానికి పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube