కంటతడి పెట్టుకున్న విజయ్ దేవరకొండ.. గుర్తుండిపోతావంటూ..?

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.వరుస విజయాలతో జోరుమీదున్న ఈ హీరో అభిమాని మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు.

 Vijay Deverakonda Gets Emotional Over Fan Hemanth Death-TeluguStop.com

పెళ్లిచూపులు సినిమాతో తొలి హిట్ ను అందుకున్న విజయ్ దేవరకొండకు ఆ సినిమా నుంచే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.అర్జున్ రెడ్డి, గీతా గోవిందం విజయాలతో యూత్ లో విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ప్రస్తుతం ఈ హీరో డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాలో నటిస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాగా లైగర్ 125 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ ఉండటం గమనార్హం.

 Vijay Deverakonda Gets Emotional Over Fan Hemanth Death-కంటతడి పెట్టుకున్న విజయ్ దేవరకొండ.. గుర్తుండిపోతావంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తను ఈ స్థాయికి ఎదగడానికి అభిమానులే కారణమని చెప్పుకునే విజయ్ తన వీరాభిమానులలో ఒకరైన హేమంత్ చనిపోయాడనే విషయం తెలిసి ఎమోషనల్ అయ్యారు.గత కొన్నిరోజులుగా క్యాన్సర్ తో బాధ పడుతున్న హేమంత్ చివరి కోరికగా విజయ్ దేవరకొండతో వీడియో కాల్ మాట్లాడాలని కోరుకున్నారు.

ఈ విషయం తెలిసి విజయ్ దేవరకొండ అభిమానితో వీడియో కాల్ మాట్లాడారు.అభిమాని కోసం విజయ్ దేవరకొండ టీషర్ట్ లను కూడా పంపగా ఆ టీషర్ట్ లను ధరించక ముందే హేమంత్ మృతి చెందారు.అభిమాని మరణ వార్త తెలిసి విజయ్ దేవరకొండ చలించిపోయి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.హేమంత్ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని ఎప్పటికీ హేమంత్ ను మిస్సవుతూ ఉంటానని విజయ్ దేవరకొండ అన్నారు.

హేమంత్ మరణ వార్త విని తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని కన్నీళ్లతో దేవుడిని ప్రార్థిస్తున్నానని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.హేమంత్ ను తన వరకు చేరుకునేలా చేసిన వాళ్లకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

హేమంత్ లో మధురమైన చిరునవ్వు చూశానని హేమంత్ ప్రేమను ఫీల్ అయ్యానని మిస్ యూ హేమంత్ అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ పెట్టారు.

#Gets Emotional #Hemanth Death #Emotional Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు