కాలుజారి పడబోయిన విజయ్‌ దేవరకొండ

సెలబ్రెటీలకు చెందిన ప్రతి విషయం కూడా జనాల్లో ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది.వారు ఏం చేసినా.

 Vijay Deverakonda Fallen Out Slip With Leg-TeluguStop.com

వారికి ఏం జరిగినా కూడా అంతా కూడా తెలుసుకునేందుకు ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు.తాజాగా విజయ్‌ దేవరకొండ ముంబయిలో షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో కాలు జారి కింద పడబోయాడు.

కింద అయితే పడలేదు కాని జారి పడబోవడంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.విజయ్‌ దేవరకొండ కింద పడబోయాడు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు.

Telugu Vijay Laigar, Vijay Mumbai-Movie

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ లైగర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా షూటింగ్‌ కోసం ముంబయిలోని హర్బర్‌ ప్రాంతంకు చిత్ర యూనిట్‌ సభ్యులు చేరుకున్నారు.దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మి, హీరోయిన్‌ అనన్య పాండేలు ముందుగా అక్కడకు చేరుకోగా కొద్ది సమయం తర్వాత విజయ్‌ దేవరకొండ వచ్చాడు.రోడ్డు నుండి హర్బర్‌లోకి నడుస్తున్న సమయంలో విజయ్‌ దేవరకొండ స్లిప్‌ అయ్యాడు.

పక్కనే ఉన్న వారు పట్టుకోవడంతో కింద పడలేదు.

Telugu Vijay Laigar, Vijay Mumbai-Movie

షూటింగ్‌కు హడావుడిగా నడుస్తున్న సమయంలో అది కూడా అక్కడ కాస్త తడి ఉన్న కారణంగా విజయ్‌ జారిపడబోయాడు.అంతకు మించి ఏం లేదని వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది.ఇక విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాను సమ్మర్‌లోనే విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మేలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.‘వకీల్‌ సాబ్‌’ చిత్రం కూడా మే లోనే విడుదల కాబోతుంది.కనుక ఆ సినిమా విడుదల తేదీ విచ్చన తర్వాత ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube