అందుకే ఆ చెప్పులు వేసుకెళ్తున్నా.. క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్‌.

 Vijay Deverakonda Explains Y He Wear Chappals For Promotions , Vijay Devarakonda-TeluguStop.com

ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.విడుదల తేదీకి మరికొద్ది రోజులు సమయం ఉండడంతో చిత్ర బంధం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇప్పటికీ జోరుగా ఈ సినిమా ప్రమోషన్స్ ని చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ చెప్పులేసుకోవడం విషయంపై అనేక రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే విజయ్ దేవరకొండ అలా సింపుల్ గా చెప్పులు ఎందుకు వేసుకున్నారు అంటూ కూడా చాలామంది ఆలోచించిన సమాధానం దొరకలేదు.

ఇదే విషయం పై విజయ్ దేవరకొండ స్పందించారు.

సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసమే తాను ఇలా చెప్పులు వేసుకుని వెళ్తున్నట్టు తెలిపాడు విజయ్.లైగర్‌ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకం నాకు ఉంది.

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉంది అని తెలిపాడు విజయ్ దేవరకొండ.ప్రతిరోజు కొత్త డ్రెస్ దానికి మ్యాచింగ్ అయ్యే విధంగా షూస్ కోసం వెతకడానికి చాలా సమయం పడుతుంది.

అందుకే ఈ చెప్పులను కొనుగోలు చేశాను.దీనివల్ల నా డ్రెస్సింగ్ కి ఎక్కువ సమయం పట్టడం లేదు.

Telugu Chappals, Liger, Puri Jagannath, Tollywood-Movie

అయితే నేను సినిమా ప్రమోషన్స్ లో చెప్పులు వేసుకోవడంపై ఎవరు ఏమి అనుకున్నా నేను పెద్దగా పట్టించుకోను.ఎందుకంటే నాకు ఏం చేయాలి అనిపిస్తే అదే చేస్తాను అని చెప్పుకొచ్చాడు విజయ్.లైగర్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.కాగా విజయ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం.

ఈ సినిమాకి కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.కాగా ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.

ఆగస్టు 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube