మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో అదరగొట్టబోతున్న రష్మిక, దేవరకొండ... ఈ సారి అక్కడ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో టాలీవుడ్ లో వచ్చిన మొదటి సినిమా గీతాగోవిందం.ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

 Vijay Deverakonda And Rashmika Romance In Bollywood Screen-TeluguStop.com

ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్ ఈ మూవీ సొంతం చేసుకుంది.ఆన్ స్క్రీన్ పై రష్మిక, దేవరకొండ జోడీకి ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు.

ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం కూడా వచ్చేసింది.గీతాగోవిందం తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండ మరో సారి డియర్ కామ్రేడ్ మూవీలో జత కట్టారు.

 Vijay Deverakonda And Rashmika Romance In Bollywood Screen-మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో అదరగొట్టబోతున్న రష్మిక, దేవరకొండ… ఈ సారి అక్కడ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మూవీ కథ బాగున్న, కథనంలో లోపాలు వలన ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.అయితే డియర్ కామ్రేడ్ లో కూడా దేవరకొండ, రష్మిక జోడీ అద్బుతంగా ఉందనే ప్రశంసలు వచ్చాయి.

ఇక ఈ మూవీ తర్వాత ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు.రౌడీ విజయ్ పూరితో లైగర్ సినిమా చేసుకుంటున్నాడు.

రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప మూవీతో పాటు పాటు శర్వానంద్ కి జోడీగా ఆడవాళ్ళు మీకు జోహార్లు చేస్తుంది.అలాగే హిందీలో మూడు సినిమాలు లైన్ లో పెట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

అయితే ఈ జంట ఆ మధ్య ముంబైలో ఓ పార్టీకి వెళ్లి బయటకి వస్తూ ఉండగా కెమరా కంటికి చిక్కారు.దీంతో బిటౌన్ లో ఈ వీరిద్దరిపై హాట్ గాసిప్స్ మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికరమైన న్యూస్ బిటౌన్ లో వినిపిస్తుంది.కరణ్ జోహార్ విజయ్ దేవరకొండతో హిందీలో స్ట్రైట్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.

ఆ మూవీలో హీరోయిన్ గా రష్మికని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని టాక్ నడుస్తుంది.ఇక లైగర్ తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుందని జోరుగా కథనాలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరు కూడా మరో సారి తెరపై కలిసి రొమాన్స్ చేయడానికి ఒకే చెప్పేశారని బిటౌన్ లో గట్టిగా వినిపిస్తుంది.

#Karan Johar #Rashmika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు