చరణ్, విజయ్ కంట్రోల్ లోకి వెళ్లిపోయిన సోషల్ మీడియా.. అంతలా ఈ స్టార్స్ రచ్చ!

మన టాలీవుడ్ స్టార్స్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ , రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా నిన్న అంత సోషల్ మీడియాను వారి గ్రిప్ లో పెట్టుకున్నారు.ఎందుకు అని అనుకుంటున్నారా.

 Vijay Deverakonda And Ram Charan Takes Over Social Media, Liger , Rc 15, Shnaker , Vijay Deverakonda, Ram Charan, Social Media-TeluguStop.com

నిన్న విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా నుండి కొత్త లుక్ వచ్చిన విషయం తెలిసిందే.విజయ్ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా కేవలం బొకే అడ్డం పెట్టుకుని న్యూడ్ గెటప్ లో ఉన్న పోస్టర్ ను రివీల్ చేసారు.

ఈ ఫోటో నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ అయ్యింది.దీంతో నిన్న అంతా విజయ్ ఈ పోస్టర్ గురించి మాట్లాడు కున్నారు.

 Vijay Deverakonda And Ram Charan Takes Over Social Media, Liger , Rc 15, Shnaker , Vijay Deverakonda, Ram Charan, Social Media-చరణ్, విజయ్ కంట్రోల్ లోకి వెళ్లిపోయిన సోషల్ మీడియా.. అంతలా ఈ స్టార్స్ రచ్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖులు కూడా విజయ్ గట్స్ కు ప్రశంసలు కురిపించారు.ఇలా విజయ్ నిన్నటి నుండి అంతా తన గురించి మాట్లాడుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.

ఇక మరొక స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పుకోవాలి.ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు చరణ్.

దీంతో ఈయన నుండి ఏ న్యూస్ బయటకు వచ్చిన అది వైరల్ అవుతూనే ఉంది.ప్రెసెంట్ రామ్ చరణ్ ఆర్సీ 15 సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు.ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ జరుపు కుంటుంది.ఇది ఇలా ఉండగా నిన్న చరణ్ స్టైలిస్ట్ తన కొత్త హెయిర్ స్టయిల్ ను చిన్న గ్లిమ్స్ రూపంలో వదిలాడు.

చరణ్ సగం లుక్ మాత్రమే రివీల్ చేసిన ఆ లుక్ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది.నిన్నటి నుండి చరణ్ లుక్ పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించు కుంటున్నారు.

ఇలా చరణ్ కూడా సోషల్ మీడియాను తన కంట్రోల్ లో పెట్టుకున్నాడు.ఈ విధంగా నిన్న అంతా కూడా మన స్టార్ హీరోల గురించి సోషల్ మీడియాలో వార్తలు హీట్ ఎక్కాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube