విజయ్ దేవరకొండ అందరిలో తాను చాలా ప్రత్యేకం అంటూ పదే పదే నిరూపించుకుంటూ ఉంటాడు.తాజాగా ఈయన పుట్టిన రోజు జరుపుకున్నాడు.
పుట్టిన రోజు సందర్బంగా విజయ్ దేవరకొండ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.తన యాటిట్యూడ్‌తో పాటు, పలు విషయాలను ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
తాను ఎప్పుడు కూడా ఎవరో ఏదో అనుకుంటారని చేయను, నేను అనుకున్నదే చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… నిన్ననే మమ్మీ నన్ను రెండేళ్లకు పెళ్లి చేసుకోమంది.
నేను పెళ్లి ఎందుకు చేసుకోవాలని మమ్మీని అడిగినప్పుడు పిల్లలు కావాలి కదరా అంది.కాని నేను మాత్రం పిల్లల కోసం పెళ్లి చేసుకోను అని చెప్పాను.వాడెవ్వడి కోసమో నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి.వారి కోసం నా జీవితంను ఎందుకు మార్చుకోవాలని అన్నాడు.
ఇక లవ్ మ్యారేజ్ లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటాను తప్ప రిలేషన్ షిప్లో ఉండను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.జులై నెలలో ఆ చిత్రం రాబోతుంది.ఆ వెంటనే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఒక చిత్రంను చేయబోతున్న విషయం తెల్సిందే.
ఈ రెండు చిత్రాలు కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఈ రెండు చిత్రాలపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.మరి ఆ రెంటితో సక్సెస్‌ను దక్కించుకుంటాడా చూడాలి.