విజయ్ దేవరకొండ సినిమా ప్రీప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ఇంద్రగంటి  

Vijay Devarakonda\'s next with Mohan Krishna Indraganti, Tollywood, Telugu Cinema, South cinema, Lockdown, Corona Effect - Telugu Corona Effect, Lockdown, South Cinema, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda\\'s Next With Mohan Krishna Indraganti

క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి ఇంద్రగంటి మోహనకృష్ణ.ఎప్పుడూ కూడా విభిన్న చిత్రాలు తీస్తూ ఒక సినిమాతో ఇంకో సినిమాకి సంబంధం లేకుండా కథలని తెరపై ఆవిష్కరించే ఇంద్రగంటికి సక్సెస్ రేషియో కూడా భాగానే ఉంది.

 Vijay Devarakondas Next With Mohan Krishna Indraganti

ప్రస్తుతం నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రంగా వి సినిమా తెరకెక్కించారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయి రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.

అయితే ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ లేకపోవడం సినిమా వాయిదా పడుతూ వస్తుంది.ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసేందుకు ఇంద్రగంటి ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ సినిమా ప్రీప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ఇంద్రగంటి-Movie-Telugu Tollywood Photo Image

క్రేజీ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ కమర్షియల్ యూత్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించడానికి ఇంద్రగంటి సిద్ధం అవుతున్నాడు.విజయ్ ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో బాక్సింగ్ నేపధ్యంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఇంద్రగంటి మూవీని విజయ్ సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడని తెలుస్తుంది.

ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ ఇప్పటికే స్టార్ట్ అయ్యిందని, హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

#Lockdown #Corona Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Devarakondas Next With Mohan Krishna Indraganti Related Telugu News,Photos/Pics,Images..