అన్నను విమర్శించిన బాలీవుడ్ నటుడుకి తమ్ముడు కౌంటర్

ఆ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ తన పాడ్ కాస్ట్ ఆడియోలో ఓటు హక్కు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.రేషన్ కార్డు ఉన్నవారికి ఓటు హక్కు రద్దు చేయాలని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 Vijay Devarakonda's Brother Fires On Bollywood Actor Gulshan, Tollywood, Bollywo-TeluguStop.com

రేషన్ కార్డు ఉపయోగించేవారికి ప్రభుత్వాన్ని నిర్ణయించే శక్తి ఉండదని, అలాంటి వారికి ఓటు హక్కు ఇచ్చిన సరైన నాయకులని ఎన్నుకోలేరని తెలిపారు.ఆ సమయంలో చాలా మంది సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ మీద తీవ్రంగా విమర్శలు చేశారు.

పూరి ఐడియాలజీని తప్పు పట్టారు.తాజాగా రౌడీ స్టార్ విజయ్ కూడా ఇంచు మించు అలాంటి వాఖ్యలే చేశారు.

మందుకి, డబ్బుకి అమ్ముడుపోయే వారికి ఓటు హక్కు తొలగించాలని, అలాగే డబ్బున్నవారికి, పేదవారికి, చదువులేని వారికి ఓటు హక్కు ఉండకూడదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనఅభిప్రాయాన్ని పంచుకున్నాడు.

అయితే విజయ్ దేవరకొండ వాఖ్యల మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

కనీసం అవగాహన లేకుండా విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.పలువురు ప్రముఖులు కూడా విజయ్ వ్యాఖ్యలని ఖండించారు.

బాలీవుడ్ నటుడు గుల్షన్ విజయ్ పై విజయ్ వాఖ్యలపై సెటైరికల్ కామెంట్స్ చేశాడు.తలలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకొక హెయిర్ కట్ ను సూచిస్తానని చెప్పాడు.

ఈ కామెంట్ పై విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా విమర్శించే ముందు అవతలి వ్యక్తి ఏం మాట్లాడారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికాడు.

అయితే నెటిజన్లు చాలా మంది విజయ్ వాఖ్యలపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని, వారందరికీ ఆనంద్ దేవరకొండ ఎలా సమాధానం చెబుతాడని ఇప్పుడు చాలా మంది స్పందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube