ఆ బయోపిక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విజయ్..!

దశాబ్ధాల నుండి తెలుగులో స్టార్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న హీరోలుండగా కేవలం మూడంటే మూడే సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది రౌడీ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు యువ సంచలనం విజయ్ దేవరకొండ.పెళ్లి చూపులు నుండి టాక్సీవాలా వరకు విజయ్ చేసిన సినిమాల లెక్క అందరికి తెలిసిందే.

 Vijay Devarakondas Bollywood Debut With Kabir Khan Movie-TeluguStop.com

కాని అతను రేంజ్ ఏంటన్నది తెలిస్తే మిగతా హీరోలు అసూయ పడాల్సిందే.టాక్సీవాలా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్నాడు.

భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటుగా మరో తెలుగు సినిమా చేస్తున్న విజయ్ కు బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయన్న విషయం తెలిసిందే.ఈమధ్య ఇంటర్వ్యూస్ లో కూడా బాలీవుడ్ పై తన ఇంట్రెస్ట్ చూపించాడు దేవరకొండ.అలా అన్నాడో లేదో ఓ బాలీవుడ్ బయోపిక్ సినిమాలో ఛాన్స్ పట్టేశాడు విజయ్ దేవరకొండ.

కపిల్ దేవ్ జీవిత చరిత్రతో కబీర్ ఖాన్ చేస్తున్న 83 సినిమాలో విజయ్ దేవరకొండ ఛాన్స్ దక్కించుకున్నాడు.కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్ నటిస్తున్న ఈ మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో విజయ్ కనిపిస్తాడట.

భారతీయ క్రికెట్ చరిత్రలో 1983 ప్రపంచ కప్ ఎంత గొప్పదో తెలిసిందే.కపిల్ సారధ్యంలో మొదటి ప్రపంచ కప్ అందుకున్న భారత జట్టు అప్పటి పరిస్థితులను కపిల్ దేవ్ కెప్టెన్సీ విధి విధానాలు ఈ బయోపిక్ లో ప్రస్థావిస్తారట.కపిల్ దేవ్ కు అత్యంత సన్నిహితుడైన శ్రీకాంత్ కృష్ణమాచారి పాత్రలో విజయ్ నటిస్తున్నాడని తెలుస్తుంది.ఆల్రెడీ ఈ సినిమాకు సైన్ చేసిన విజయ్ దేవరకొండ త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ బాలీవుడ్ జర్నీ ఎలా సాగుతుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube