విజయ్‌ దేవరకొండ 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' కథ ఇదేనా?  

World Famous Lover Movie Story Leaked-kranthi Madav,tollywoo Boxoffice,vijay Devarakonda,world Famous Lover Movie

‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం నిరాశ పర్చినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా స్పీడ్‌గా తన తదుపరి చిత్రంను పూర్తి చేసే పనిలో విజయ్‌ దేవరకొండ ఉన్నాడు.క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కేఎస్‌ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.

World Famous Lover Movie Story Leaked-Kranthi Madav Tollywoo Boxoffice Vijay Devarakonda

ఇటీవలే టైటిల్‌ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అనౌన్స్‌ చేయగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.సినిమా టైటిల్‌తోనే మరోసారి విజయ్‌ దేవరకొండ అందరి దృష్టిని ఆకర్షించాడు.

విభిన్నమైన ప్రేమ కథలతో ఈ చిత్రం ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది.తాజాగా ఈ చిత్ర కథ అంటూ ఒక స్టోరీ లైన్‌ ప్రచారం జరుగుతోంది.

World Famous Lover Movie Story Leaked-Kranthi Madav Tollywoo Boxoffice Vijay Devarakonda

  ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ రొమాంటిక్‌ కథల రచయితగా కనిపించబోతున్నాడు.ఆయన రాసే ఒక కథలో నాలుగు విభిన్నమైన ప్రాంతాలకు చెందిన నలుగురు అమ్మాయిలతో ఒకే వ్యక్తి ప్రేమ ఎలా సాగుతుంది, అతడి ప్రేమలో ఉన్న అసలు మతలబు ఏంటీ అనేది ఈ చిత్రం కథగా ఉండబోతుందట.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఇప్పటి వరకు క్రాంతి మాధవ్‌ తీసిన సినిమాలకంటే ఇది చాలా విభిన్నంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ మరోసారి సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాలని ఆశ పడుతున్నాడు.ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ లుక్‌ కూడా విభిన్నంగా ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

నాలుగు విభిన్నమైన ప్రేమ కథలను చూపిస్తూ, వాటి మద్య ఒక కామన్‌ పాయింట్‌తో కలపడం అనేది చాలా విభిన్నమైన పాయింట్‌ అంటూ టాక్‌ వస్తుంది.మరి చిత్రం ఎలా ఉంటుంది అనేది చూడాలి.

తాజా వార్తలు

World Famous Lover Movie Story Leaked-kranthi Madav,tollywoo Boxoffice,vijay Devarakonda,world Famous Lover Movie Related....