అట్టర్ ఫ్లాప్ సినిమాకు అవార్డు అందుకున్న రౌడీ

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు హీరో విజయ్ దేవరకొండ.ఆ సినిమాతో మనోడికి వచ్చిన ఫాలోయింగ్ మామూలుది కాదు.

 Vijay Devarakonda Wins Award For Dear Comrade-TeluguStop.com

ఆ ఒక్క సినిమాతో స్టార్ హీరోలకు పోటీగా మారాడు ఈ హీరో.అర్జున్ రెడ్డి తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న విజయ్ దేవరకొండకు గీతా గోవిందం చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించింది.

అయితే ఆ తరువాత మరోసారి ఫుల్ కాన్ఫిడెంట్‌గా విజయ్ చేసిన చిత్రం డియర్ కామ్రేడ్.రిలీజ్‌కు ముందే అదిరిపోయే ప్రమోషన్స్, భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాలో అసలు మ్యాటర్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

సినిమా కనీస కలెక్షన్స్ సాధించకపోవడంతో అట్టర్‌ఫ్లాప్ మూవీగా నిలిచింది.కానీ ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్‌కు మాత్రం జనాలు ఫిదా అయ్యారు.

ఇప్పుడు అదే యాక్టింగ్ మనోడికి ఓ అవార్డును కూడా తెచ్చి పెట్టింది.బిహైండ్‌వుడ్స్ అనే సంస్థ అందించిన అవార్డుల్లో డియర్ కామ్రేడ్ సినిమాలో నటనకు గాను విజయ్ దేవరకొండకు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు లభించింది.

దీంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.సినిమా ఫెయిల్ అయినా మావాడు హిట్ అయ్యాడంటూ వారు మురిసిపోతున్నారు.

ఏదేమైనా విజయ్ దేవరకొండా మజాకా అని వారు కాలర్ ఎగరేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube