అర్జున్ రెడ్డిని మిస్ చేసుకున్న యంగ్ హీరో ఎవరో తెలుసా..?

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఇమేజ్ మారిపోవడంతో పాటు మార్కెట్ పెరిగింది.

 Vijay Devarakonda Was Not The First Choice For Arjun Reddy Movie-TeluguStop.com

ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.అయితే ఈ సినిమాలో హీరోగా సందీప్ రెడ్డి వంగాకు మొదటి ఆప్షన్ మాత్రం విజయ్ దేవరకొండ కానే కాదు.

సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా కథను మొదట హీరో శర్వానంద్ కు వినిపించారు.,/br>

 Vijay Devarakonda Was Not The First Choice For Arjun Reddy Movie-అర్జున్ రెడ్డిని మిస్ చేసుకున్న యంగ్ హీరో ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అర్జున్ రెడ్డి కథ విన్న శర్వానంద్ కు ఆ కథ బాగా నచ్చింది.

అయితే ఈ సినిమాను సందీప్ రెడ్డి స్వయంగా నిర్మిస్తానని చెప్పారు.నిర్మాత, దర్శకుడు ఒక్కరే అయితే ఆ ప్రభావం రిజల్ట్ పై పడే అవకాశం ఉందని భావించి శర్వానంద్ సందీప్ రెడ్డి వంగాను అర్జున్ రెడ్డి కథ చెప్పమని వేరే నిర్మాతల దగ్గరకు పంపించారు.

అయితే కథ విన్న నిర్మాతలు అర్జున్ రెడ్డి రిస్కీ ప్రాజెక్ట్ అని భావించి ఆ సినిమాను నిర్మించడానికి ముందుకు రాలేదు.

Telugu Arjun Reddy Movie, Not First Choice, Sandeep Reddy Vanga, Sharwanand, Vijay Devarakonda-Movie

ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండను సంప్రదించడం విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.ఒకవేళ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కాకుండా శర్వానంద్ నటించి ఉంటే మాత్రం ఆ సినిమా ఈ హీరో కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉండేది.అర్జున్ రెడ్డి సక్సెస్ తో విజయ్ దేవరకొండకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

అర్జున్ రెడ్డి సక్సెస్ తరువాత విజయ్ నటించిన ట్యాక్సీవాలా, గీతా గోవిందం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.ప్రస్తుతం ఈ హీరో చేతిలో లైగర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది.

ఈ సినిమా హిట్టైతే విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ రావడంతో పాటు విజయ్ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది.

#SandeepReddy #Sharwanand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు