నెక్స్ట్ సినిమాలో కాస్త కొత్తగా ట్రై చేస్తున్న విజయ్ దేవరకొండ  

సినిమా కోసం రచయిత పాత్రలోకి మారుతున్న విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda Turned Write Role For On Screen-on Screen,telugu Cinema,tollywood,vijay Devarakonda Turned Write Role

టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ దేవరకొండ తర్వాత అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో టాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కించడానికి నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

నెక్స్ట్ సినిమాలో కాస్త కొత్తగా ట్రై చేస్తున్న విజయ్ దేవరకొండ-Vijay Devarakonda Turned Write Role For On Screen

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాని పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేస్తున్న విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా అని క్రాంతిమాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ రైటర్ గా మారినట్లు తెలుస్తోంది.

అది కేవలం స్క్రీన్ మీద మాత్రమే. కథలో భాగంగా హీరో ఓ రచయితగా తన కథల ప్రయాణంతో సాగే స్టొరీగా సినిమా ఉంటుందని తెలుస్తుంది విజయ్ దేవరకొండ మూడు కథలు రాయగా ఆ కథలు మూడు భాగాలుగా సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ కథలలో అతనే హీరోగా కనిపిస్తాడు అని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్ లను దర్శకుడు ఎంపిక చేసినట్లు సమాచారం. మరి ఇప్పటి వరకు రానటువంటి విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఎంతవరకు మరో సక్సెస్ అందిస్తుంది అనేది తెలియాలంటే వేచి చూడాలి.