ఫేవరెట్ డైరెక్టర్ కోసం రెడీ అవుతోన్న రౌడీ

టాలీవుడ్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.ఇప్పటికే పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దుమ్ములేపిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Vijay Devarakonda To Team Up With Tharun Bhascker, Vijay Devarakonda, Tharun Bha-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తుండటంతో ఇందులో విజయ్ దేవరకొండ ఎలా కనిపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ మూవీని శివ నిర్వాణ, సుకుమార్‌లతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలు పట్టాలెక్కేలోపు తన ఫేవరెట్ డైరెక్టర్ అయిన తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

గతంలో పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండకు హీరోగా అదిరిపోయే సక్సెస్ అందించిన తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో మరోసారి నటించాలని ఉందంటూ ఇప్పటికే పలుమార్లు విజయ్ తన మనసులోని మాటను చెబుతూ వచ్చాడు.అయితే 2021 ద్వితీయార్దంలో తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దేందుకు తరుణ్ భాస్కర్ సిద్ధమవుతున్నాడు.కాగా విజయ్ దేవరకొండ ఇటీవల వరసబెట్టి సినిమాలు చేస్తున్నా, అవి ఫ్లాపులుగా నిలుస్తుండటంతో ఈసారి ఎలాగైనా ఫైటర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

మరి విజయ్ దేవరకొండ ఏ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో చూడాలి అంటున్నారు ఆయన అభిమానులు.ఈసారి తరుణ్ భాస్కర్ విజయ్ కోసం ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.

కాగా తరుణ్ భాస్కర్ గతంలో హీరోగా ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube