బ్యాంకాక్ వెళ్ళబోతున్న విజయ్ దేవరకొండ

పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీగా ఫైటర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.అతని కెరియర్ లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకొంటున్న సినిమా అంటే ఇదే అని చెప్పాలి.

 Vijay Devarakonda To Resume Fighter In Bangkok, Tollywood, Telugu Cinema, Bolly-TeluguStop.com

ఎంత పెద్ద స్టార్ తో సినిమా చేసిన మూడు నెలల్లో సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేసే కెపాసిటీ పూరి జగన్నాథ్ కి ఉంది.అయితే ఇప్పుడు ఫైటర్ విషయంలో మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు.

పాన్ ఇండియా సినిమా కావడంతో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండటం వలన పెర్ఫెక్షన్ కోసం ఈ సినిమాకి ఎక్కువ రోజులు తీసుకుంటున్నాడు.అయితే లాక్ డౌన్ రూపంలో మరో అవాంతరం రావడంతో ఆరు నెలలు వాయిదా పడిపోయింది.

లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడు ఫైటర్ షూటింగ్ కి రెడీ అవుతుంది.సినిమాలు అన్ని షూటింగ్ మొదలు కావడంతో ఇప్పుడు పూరి కూడా ఫైటర్ షూటింగ్ కోసం షెడ్యూల్ ఖరారు చేశారు.

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న ఫైటర్ షూటింగ్ లాక్ డౌన్ కి ముందు చాలా వరకు ముంబైలో జరిగింది.ఇక ఈ చిత్రం షూటింగును త్వరలోనే విదేశాలలో నిర్వహిస్తారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.

ఈ సినిమా షూటింగును దర్శకుడు పూరి తన ఫేవరెట్ కంట్రీ బ్యాంకాక్ లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.బ్యాంకాక్ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్టీ మొత్తం పూర్తయిపోతుందని తెలుస్తుంది.

మిగిలిన పాటలని కూడా వెంటనే షూట్ చేయాలని అనుకుంటున్నాడు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుంది.

ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube