ఆ టైటిల్‌కు విజయ్‌ దేవరకొండ తప్ప మరెవ్వరు న్యాయం చేయలేరు.. అంత సత్తా ఏ యంగ్‌ హీరోకు లేదు

మెగాస్టార్‌ చిరంజీవి సినీ కెరీర్‌ ఆరంభంలో చేసిన చిత్రం ‘హీరో’.అప్పట్లో ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని చిరంజీవి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది.

 Vijay Devarakonda To Act As Hero In Hero Movie-TeluguStop.com

ఇప్పుడు ఆ టైటిల్‌ను మైత్రి మూవీస్‌ వారు ఫిల్మ్‌ ఛాబర్‌లో రిజిస్ట్రర్‌ చేయించారు.ఇప్పుడు ఆ టైటిల్‌ ఎవరి కోసం రిజిస్ట్రర్‌ చేయించారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మైత్రి మూవీస్‌ వారు ప్రస్తుతం లెక్కకు మించిన సినిమాలు చేస్తున్నారు.అందులో ఒకటి విజయ్‌ దేవరకొండతో చేస్తున్నారు.

విజయ్‌ దేవరకొండతో మైత్రి మూవీస్‌ వారు చేయబోతున్న సినిమాకు స్టార్‌ డైరెక్టర్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.అందుకే ఈ చిత్రంకు హీరో టైటిల్‌ను పెట్టి ఉంటారు అంటూ కొందరు అంటున్నారు.మైత్రి వారు ఏ విషయమై క్లారిటీ అయితే ఇవ్వలేదు.కాని సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రకారం అయితే ఖచ్చితంగా ఆ టైటిల్‌ విజయ్‌ దేవరకొండుకు అయ్యి ఉంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

హీరో టైటిల్‌కు ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో ఏ ఒక్కరు న్యాయం చేయలేరని, కేవలం విజయ్‌ దేవరకొండ అయితేనే ఆ టైటిల్‌కు న్యాయం చేస్తాడంటూ ఆయన అభిమానులు గట్టి నమ్మకంగా చెబుతున్నారు.తప్పకుండా ఈ టైటిల్‌ విజయ్‌ దేవరకొండకు అంటూ చెబుతున్నారు.ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube