మెగా ప్రొడ్యూసర్‌తో హ్యాట్రిక్‌కు రెడీ అంటోన్న రౌడీ  

Vijay Devarakonda Team Up Allu Aravind For Hat Trick-telugu Movies News,vijay Devarakonda,world Famous Lover

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు.తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన దేవరకొండ మరో బ్లాక్‌బస్టర్‌ను దక్కించుకునేందుకు రెడీ అవుతున్నాడు.

Vijay Devarakonda Team Up Allu Aravind For Hat Trick-Telugu Movies News Vijay World Famous Lover

అయితే ఈ సినిమా తరువాత విజయ్ మరోసారి తనకు అదిరిపోయే బ్లాక్ బస్టర్‌ను అందించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌తో కలిసి చేయడానికి రెడీ అవుతున్నాడు.

గతంలో గీతా గోవిందం, టాక్సీవాలా వంటి సూపర్ హిట్ చిత్రాలను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నటించి సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.

కాగా తమ బ్యానర్‌లో మూడో చిత్రం ఎప్పుడు నటిస్తాడా అని అల్లు అరవింద్ అడిగారట.వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండను అల్లు అరవింద్ దీనికి సంబంధించి అడిగినట్లు తెలుస్తోంది.

దీనికి విజయ్ ఎప్పుడంటే అప్పుడు రెడీ అంటూ సమాధానం ఇచ్చారట.

కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెడుతుండటంతో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మూడో సినిమా ఎప్పుడు చేస్తాడా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమా గనక తెరకెక్కితే, దానికి సంబంధించిన నటీనటులు, దర్శకులు ఎవరనే అంశం కూడా జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

తాజా వార్తలు

Vijay Devarakonda Team Up Allu Aravind For Hat Trick-telugu Movies News,vijay Devarakonda,world Famous Lover Related....