ట్యాక్సీవాలా కూడా కుమ్మేస్తాడంటున్న గోవిందం  

Vijay Devarakonda Taxiwala Movie Release Date-

విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పరుశురామ్‌ దర్శకత్వంలో మూవీ అనగానే ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి క్రియేట్‌ కాలేదు.ఎప్పుడైతే సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారో అప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవడం ప్రారంభం అయ్యింది..

Vijay Devarakonda Taxiwala Movie Release Date--Vijay Devarakonda Taxiwala Movie Release Date-

అప్పటి నుండి సినిమా విడుదల అయ్యే వరకు సినిమాపై అంచనాలు అలా అలా పెరుగుతూ పీక్స్‌కు వెళ్లి పోయాయి.రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్‌ విడుద చేయడం జరిగింది.గీత గోవిందం చివరకు సక్సెస్‌ టాక్‌ను తెచ్చుకుంది.

‘గీత గోవిందం’ చిత్రంకు ముందు విజయ్‌ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కాని కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం వాయిదా వేసి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకు వచ్చారు.ట్యాక్సీవాలా చిత్రం కంటే గీత గోవిందం విషయంలో ఎక్కువ నమ్మకం ఉన్న కారణంగానే ఈ సినిమాను ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.గీత గోవిందం సినిమా మంచి టాక్‌ను దక్కించుకున్న నేపథ్యంలో ఇప్పుడు ట్యాక్సీవాలాపై అందరి దృష్టి కేంద్రీకృతం అవుతుంది.

‘ట్యాక్సీవాలా’ చిత్రం చాలా విభిన్నంగా ఉంటుంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ అందరిని అరించింది.విజయ్‌ దేవరకొండ చాలా విభిన్నమైన పాత్రను ఆ చిత్రంలో చేయడం జరిగింది..

రెండు పెద్ద బ్యానర్‌లు ఆ సినిమాను నిర్మించిన కారణంగా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.కాని సినిమా షూటింగ్‌ సమయంలో కొన్ని తప్పులు జరిగాయని, ఆ తప్పులు సరిచేసేందుకు కాస్త సమయం అయ్యిందని, త్వరలోనే ట్యాక్సీవాలాను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ట్యాక్సీవాలా చిత్రంకు గీత గోవిందం చిత్రం సక్సెస్‌ తప్పకుండా బూస్ట్‌ను ఇస్తుందని సినీ వర్గాల వారు నమ్ముతున్నారు.తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా మాట్లాడుతూ తప్పకుండా ట్యాక్సీవాలా కూడా మంచి సినిమా అవుతుందని, తన నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమాను అయితే కోరుకుంటున్నారో ట్యాక్సీవాలా అలాంటి సినిమానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఆయన పేర్కొన్నాడు.

గీత గోవిందం విడుదలైన సక్సెస్‌ దక్కించుకున్న నేపథ్యంలో ట్యాక్సీవాలా తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.