క్రిస్మస్‌కు రౌడీ ఏం చేశాడంటే?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏదీ చేసిన సెన్సేషనే.ఆయన సినిమాలతోనే కాకుండా ఫ్యాన్స్‌తో చేసే రచ్చ మామూలుగా ఉండదు.

 Vijay Devarakonda Surprise To Fans On Christmas-TeluguStop.com

అయితే క్రిస్మస్ కానుకగా విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్‌కు ఓ అనుకోని సర్‌ప్రైజ్ ఇచ్చాడు.ప్రతి ఏటా తన అభిమానులకు ఏదో రకంగా గిఫ్టులు ఇచ్చే విజయ్ దేవరకొండ ఈ సారి కూడా ఆ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యాడు.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులను ఏదైనా కోరుకోమని చెప్పాడు.వీలైనంత వరకు వారి కోరికలు తీర్చేందుకు ప్రయత్నిస్తాడని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.అతడికి అందిన కోరికల్లో కొన్నింటిని నిజం చేస్తూ గిఫ్టులు రెడీ చేస్తున్న వీడియోను విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.తన అభిమానులను సంతోష పెట్టడమే తనకు పెద్ద సంతోషం అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

అభిమానులకు తమదైన శైలిలో బహుమతులు అందిస్తూ వారి సంతోషాన్ని తమ సంతోషంగా భావిస్తున్నారు సినీ ప్రముఖులు.ఇక క్రిస్మస్ సందర్భంగా ఈ పండగను సంతోషంగా జరుపుకోవాలని విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube