లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న రౌడీ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ఫక్తు కమర్షియల్ మూవీగా తెరకెక్కించేందుకు పూరీ రెడీ అవుతున్నాడు.

 Vijay Devarakonda, Fighter, Puri Jagannadh-TeluguStop.com

ఫైటర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో విజయ్ చాలా ఫిట్‌గా కనిపించేందుకు ముంబైలో ఫుల్ ట్రైనింగ్‌ తీసుకున్నాడు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.దీంతో విజయ్ తన బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు నానా కష్టాలు పడుతున్నాడు.ప్రస్తుతం జిమ్‌లన్నీ కూడా మూసివేసి ఉండటంతో విజయ్ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు.మిగతా హీరోల మాదిరిగా తనకు ఇంటి వద్ద జిమ్ లేకపోవడమే దీనికి కారణం.

అయితే విజయ్ కష్టానికి ఎలాంటి పరిష్కారం వస్తుందో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.ఇక ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube