ఆ క్షణం అమ్మానాన్న ఏడ్చారు.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

Vijay Devarakonda Shocking Comments About His Parents

సినిమా రంగంలో నటుడిగా ప్రూవ్ చేసుకుని సక్సెస్ కావడం అంటే ప్రస్తుత కాలంలో సులువైన విషయం కాదు.బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలే నటులుగా సక్సెస్ కాలేక సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

 Vijay Devarakonda Shocking Comments About His Parents-TeluguStop.com

అయితే విజయ్ దేవరకొండ మాత్రం నటుడిగా ప్రూవ్ చేసుకోవడంతో పాటు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవడం గమనార్హం.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో సక్సెస్ సాధించారు.

 Vijay Devarakonda Shocking Comments About His Parents-ఆ క్షణం అమ్మానాన్న ఏడ్చారు.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆనంద్ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కిన పుష్పక విమానం వచ్చే నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తల్లిదండ్రులు తనకంటే ఆనంద్ నే ఎక్కువగా గారాబం చేశారని చెప్పుకొచ్చారు.

తాను అమ్మ ఫేవరెట్ అని ఆనంద్ డాడీ ఫేవరెట్ అని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు.

Telugu Anand Devara Konda, Avd Theatres, Cried, Interesting Facts, Job In Usa, Liger, Parents, Pushpaka Vimanam Movie, Shocking Comments, Vijay Devarakonda, Vijay Devarakonda Parents-Movie

చిన్నప్పుడు క్రికెట్ ఆడే సమయంలో తనకు, తమ్ముడికి గొడవలు జరిగేవని విజయ్ పేర్కొన్నారు.ఆనంద్ కు యూఎస్ లో ఉద్యోగం వచ్చిన క్షణంలో సంతోషంతో అమ్మానాన్న ఏడ్చేశారని విజయ్ వెల్లడించారు.చేతికి డబ్బులు వచ్చిన వెంటనే సినిమాలను నిర్మిస్తుంటానని తాను ఏవీడీ థియేటర్ ను నిర్మించానని విజయ్ వెల్లడించారు.

Telugu Anand Devara Konda, Avd Theatres, Cried, Interesting Facts, Job In Usa, Liger, Parents, Pushpaka Vimanam Movie, Shocking Comments, Vijay Devarakonda, Vijay Devarakonda Parents-Movie

తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్లు చాలా ఉన్నాయని అయితే ఆ సీక్రెట్లను ఎవరికీ చెప్పనని విజయ్ పేర్కొన్నారు.ఈ నెల 30వ తేదీన ట్రైలర్ రిలీజవుతుందని ట్రైలర్ తనకు ఎంతగానో నచ్చిందని విజయ్ పేర్కొన్నారు.పూర్తిస్థాయి వినోదభరితచిత్రంగా తెరకెక్కిన పుష్పక విమానం రిలీజయ్యాక ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.విజయ్ ప్రస్తుతం లైగర్ మూవీలో నటిస్తుండగా ఈ సినిమాకు విజయ్ పారితోషికం ఏకంగా 25 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

#Cried #Avd #Job Usa #Liger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube