శివ నిర్వాణతో రౌడీ హీరో సినిమా అప్డేట్..!

నిన్ను కోరి, మజిలీ సినిమాలతో హిట్ అందుకున్న శివ నిర్వాణ తన నెక్స్ట్ సినిమా టక్ జగదీష్ తెరకెక్కించాడు.నానితో ఆల్రెడీ నిన్ను కోరి సినిమా తీసి హిట్ అందుకున్న శివ నిర్వాణ రెండవ సినిమాగా టక్ జగదీష్ చేశారు.

 Vijay Devarakonda Shiva Nirvana Movie Update , Devarakonda Vijay, Liger, Rowdy H-TeluguStop.com

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా టక్ జగదీష్ అన్ని రకాల ఎమోషన్స్ తో వస్తుందని తెలుస్తుంది.ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచగా వినాయక చవితి సందర్భంగా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమా విషయంలో చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాడని తెలిసిందే.

అయితే ఈమధ్య విజయ్ కేవలం పాన్ ఇండియా సినిమాలే చేస్తాడని.శివ నిర్వాణకు దొరకడం కష్టమని వార్తలు వచ్చాయి.కాని ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు డైరక్టర్ శివ నిర్వాణ.విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుందని.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అన్నారు శివ నిర్వాణ.మొత్తానికి విజయ్ తో శివ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

 ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube