రామ్‌ చరణ్‌తో సమానమైన హోదా దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ     2018-12-06   09:44:10  IST  Ramesh P

ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ ఏస్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌ దేవరకొండ పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ఏ సినిమా చేసినా కూడా విజయ్‌ దేవరకొండ ఆ చిత్రంతో సూపర్‌ హిట్‌ను అందుకుంటున్నాడు. కేవలం అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ టాలీవుడ్‌లోనే స్టార్‌ హీరోగా మారిపోయాడు. ఆ విషయాన్ని పోర్బ్స్‌ వెళ్లడి చేసింది.

Vijay Devarakonda Shares Ramcharan Position With Equally-Tollywood Top 72 Th Place

ఇండియాలో అత్యధిక సంపాదన పొందుతున్న సెలబ్రెటీల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఆ జాబితాలో నెం.1లో సల్మాన్‌ ఖాన్‌ నిలిచాడు. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా పలువురు ఈ జాబితాలో ఉన్నారు. మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌లతో పాటు ఇంకా కొందరు తెలుగు హీరోలు ఉన్నారు. అయితే ఈ జాబితాలో విజయ్‌ దేవరకొండ పేరు ఉండటం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. సంచలన హీరో అయినప్పటికి విజయ్‌ దేవరకొండ ఆదాయం ఫోర్బ్స్‌ లో చేరేంత ఉండదని అంతా భావించారు. కాని అనూహ్యంగా రామ్‌ చరణ్‌తో పోటీ పడుతూ మరీ విజయ్‌ దేవరకొండ ఆదాయంను కలిగి ఉన్నట్లుగా ఫోర్బ్స్‌ ప్రకటించింది.

Vijay Devarakonda Shares Ramcharan Position With Equally-Tollywood Top 72 Th Place

టాప్‌ 100లో రామ్‌ చరణ్‌ మరియు విజయ్‌ దేవరకొండలు 72వ స్థానంను పంచుకుంటున్నారు. ఇద్దరు కూడా ఒకే స్థానంలో నిలవడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. రామ్‌ చరణ్‌ ఒక్కో సినిమాకు భారీ పారితోషికం తీసుకుంటాడు. మరి విజయ్‌ దేవరకొండ స్థానం, చరణ్‌ స్థానం ఒక్కటే ఎలా అయ్యిందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం రామ్‌ చరణ్‌ తప్పుడు లెక్కలు చూపించడం వల్ల దేవరకొండతో నిలిచాడు అంటున్నారు. మొత్తానికి చరణ్‌ మరియు విజయ్‌ దేవరకొండలు ఒకే స్థాయిలో ఉండటంతో సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చనీయాంశం అయ్యింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.