హీరోయిన్‌కు డ్రస్‌ పంపి తప్పుగా అనుకోకంటూ రౌడీ స్టార్‌ మెసేజ్‌

టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ అంటే లేడీస్‌ పడిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కేవలం సాదారణ అమ్మాయిలను మాత్రమే కాకుండా స్టార్స్‌ను కూడా అంటే హీరోయిన్స్‌ను కూడా మనోడు పటాయిస్తూ ఉంటాడు అనే టాక్‌ ఉంది.

 Vijay Devarakonda Send A Gift To Kiara Adwani1 1tstop-TeluguStop.com

మొత్తానికి విజయ్‌ దేవరకొండ మరోసారి ఆ పేరును సార్ధకం చేసుకున్నాడా అనిపిస్తుంది.తాజాగా ఈయన కియారా అద్వానీకి గిఫ్ట్‌ ఇచ్చి కాస్త డెప్త్‌గా మెసేజ్‌ పంపించి ఆమెను ఇంప్రెస్‌ చేశాడు.

అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కబీర్‌ సింగ్‌ చిత్రంలో షాహిద్‌ కపూర్‌కు జోడీగా ముద్దుగుమ్మ కియారా అద్వానీ నటించిన విషయం తెల్సిందే.తెలుగులో షాలిని పాండే పోషించిన పాత్రను పోషించిన కియారా అద్వానీకి మంచి పేరు దక్కింది.

ఆ పాత్రలో కియారా చూపించిన నటన మరియు ఇతరత్ర విషయాల గురించి అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే విజయ్‌ దేవరకొండ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక డ్రస్‌ను బహుమానంగా పంపించాడు.

హీరోయిన్‌కు డ్రస్‌ పంపి తప్ప

‘కబీర్‌ సింగ్‌’ చిత్రంలో మంచి నటనతో ఆకట్టుకున్నందుకు శుభాకాంక్షలు.ఈ విజయాన్ని బాగా ఎంజాయ్‌ చేయి.నీకు నా వంతుగా ఒక డ్రస్‌ పంపిస్తున్నాను.నేను పంపిస్తున్న డ్రస్‌ను తప్పుగా అనుకోవని నేను భావిస్తున్నాను అంటూ కాస్త ఎమోషనల్‌గా విజయ్‌ దేవరకొండ తన మెసేజ్‌లో పేర్కొన్నాడు.

విజయ్‌ దేవరకొండ బహుమానంకు కియారా అద్వానీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌ చేసింది.కబీర్‌ సింగ్‌ ఇంకా చూడకుండానే కియారాకు మనోడు గిఫ్ట్‌ ఇవ్వడంను కాస్త అతి అంటూ కామెంట్స్‌ చేసే వారు కూడా చాలా మంది ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube