సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు ( Vijay Devarakonda ) ఇప్పుడు ఒక్క హిట్ అయినా పడాల్సిన సమయం.
ఎందుకంటే ఈయన వరుసగా రెండు ప్లాప్స్ అందుకున్నాడు.
మరీ ముఖ్యంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ ( Liger )సినిమా దారుణంగా విఫలం అయ్యింది.దీంతో ఈయన ఇప్పుడు చేస్తున్న సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు.
మరి ప్రజెంట్ విజయ్ దేవరకొండ ఖుషి( Khushi Movie ) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ( Samantha ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో విజయ్, సమంత ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది.ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా నుండి ఇప్పుడు మరో అప్డేట్ వైరల్ అవుతుంది.ఈ సినిమా ఓటిటి డీల్ లాక్ అయినట్టు తెలుస్తుంది.
అది కూడా భారీ మొత్తానికి అని టాక్.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటి డీల్ ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.అన్ని బాషల హక్కులు కలిపి అమెజాన్ 30 కోట్లకు పైగానే డీల్ కుదుర్చుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్నట్టు ఈ మధ్యనే ప్రకటించారు.కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ ( Hesham Abdul )సంగీతం అందిస్తుండగా.
మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy