తనకంటే 5 ఏళ్లు పెద్ద హీరోయిన్‌తో రౌడీ స్టార్‌ రొమాన్స్

విజయ్‌ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పూరి జగన్నాద్‌ దర్శకత్వం లో లైగర్‌ అనే సినిమా తెరకెక్కుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయింది.

 Vijay Devarakonda Romance With A Senior Star Heroine Katrina Kaif , Katrina Kaif-TeluguStop.com

ఈ సమయంలోనే విజయ్ దేవరకొండకు బాలీవుడ్ నుండి పలు ఆఫర్లు వస్తున్నాయి.లైగర్ సినిమా విడుదలకు ముందే విజయ్ దేవరకొండ అక్కడ కూడా బాగా ఫేమస్ అయ్యాడు.

ఆయన గత సినిమా ల కారణంగా రౌడీ కి ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది.భారీ ఎత్తున అంచనాలున్న లైగర్ సినిమా ను వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అప్పటి వరకు రౌడీ స్టార్‌ కొత్త గా మరో సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు.అది బాలీవుడ్‌ లో ప్రముఖ దర్శకుడితో ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయని అంటున్నారు.సినిమా హీరోయిన్‌ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది.

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ కత్రీనా కైఫ్‌ ఈ సినిమా లో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హాట్‌ బ్యూటీ కత్రీనా గతంలో టాలీవుడ్ లో నటించి గుర్తింపు దక్కించుకుంది.

కనుక ఆమెను రౌడీ స్టార్‌ కు జోడీగా ఎంపిక చేశారని తెలుస్తోంది.అయితే విజయ్ దేవర కొండ కంటే కత్రీనా కైఫ్‌ దాదాపుగా అయిదు సంవత్సరాలు పెద్ద.

అయినా కూడా ఆమె వయసు మాత్రం అలా కనిపించదు.ఇద్దరికి ఈడు జోడు బాగుంటుందని అంటున్నారు.

అయినా ఈ సినిమా లో విజయ్ దేవరకొండకు జోడీగా మెయిన్ హీరోయిన్‌ మరొకరు కూడా ఉంటారట.అంటే కత్రీనా కైఫ్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర అయ్యి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube