రౌడీ ఫ్యాన్స్‌ తెగ బాధపడుతున్నారట

విజయ్‌ దేవరకొండ వచ్చే వారంలో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Vijay Devarakonda Role Rashi Khanna-TeluguStop.com

ఫ్యాన్స్‌కు పిచ్చ పిచ్చగా ట్రైలర్‌ నచ్చేయడంతో సినిమా హిట్‌ అవ్వడం ఖాయం అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.ఇదే సమయంలో సినిమాను భారీ మొత్తానికి అమ్మేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక తాజాగా నిన్నటి ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో విజయ్‌ దేవరకొండ చెప్పిన మాటలు ప్రస్తుతం ఫ్యాన్స్‌కు గుబులు పుట్టిస్తున్నాయి.

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో విజయ్‌ దేవరకొండ లవర్‌గా కనిపించబోతున్నాడు.

తన సినీ కెరీర్‌లో లవర్‌గా కనిపించడం ఇదే చివరి సారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఎప్పుడు కూడా లవ్‌ స్టోరీలను చేయాలని భావించడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మళ్లీ లవ్‌ స్టోరీలపై ఆసక్తి చూపించనంటూ విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు.యాక్షన్‌ సినిమాలు లేదంటే డ్రామా నేపథ్యంలోని సినిమాలను మాత్రమే చేయాలని రౌడీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Lover-

విజయ్‌ దేవరకొండ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇది ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ రౌడీ నిర్ణయాన్ని సినీ వర్గాల వారు కూడా తప్పుబడుతున్నారు.అసలు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ రౌడీని ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.విజయ్‌ దేవరకొండ తన నిర్ణయాన్ని మార్చుకుని లవ్‌ స్టోరీలతో సినిమాలు చేయాల్సిందే అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు.

రౌడీ నిర్ణయం తమకు బాధను కలిగిస్తుందంటూ రౌడీ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube