మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటో షూట్ చేస్తారా.. కరణ్ ప్రశ్నకు విజయ్ రిప్లై ఇదే?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ నటి అనన్య పాండే ఇద్దరు కలిసి లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను ఎన్నో రకాల ప్రశ్నలు వేసి తన నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు.

 Vijay Devarakonda Reveals Shocking Comments In Karan Johar Show Details, Vijay D-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోల ప్రస్తావన తీసుకువచ్చారు.

రణవీర్ సింగ్ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఒంటి పై ఒక్క నూలు పోగు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా ఈ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున పలు విమర్శలకు దారితీసాయి.అయితే ఈ విషయంపై కరణ్ విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ మీరు కూడా ఏదైనా మ్యాగజైన్ కోసం ఇలాంటి అవకాశం వస్తే న్యూడ్ ఫోటో షూట్ చేస్తారా అని ప్రశ్నించారు.

Telugu Karan Johar, Koffee Karan, Liger, Puri Jagannath, Tollywood-Movie

కరణ్ ఈ విధంగా అడిగేసరికి విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ పర్వలేదు.అలాంటి ఫోటోషూట్ చేయడానికి ఇబ్బందిపడను అంటూ చెప్పుకొచ్చాడు.తాను కూడా న్యూడ్ ఫోటో షూట్ చేయడానికి ఏమాత్రం ఇబ్బంది పడనని వెల్లడించారు.అయితే లైగర్ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ ఫోటో వైరల్ అవ్వడమే కాకుండా విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటోపై ఎంతో మంది హీరోయిన్లు స్పందిస్తూ కామెంట్ చేయడం గమనార్హం.ప్రస్తుతం కరణ్ అడిగిన ప్రశ్నకు విజయ్ చెప్పిన బోల్డ్ సమాధానం వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube