ప్రెషర్ కుక్కర్ ని విడుదల చేయనున్న వరల్డ్ ఫేమస్ లవర్...

తెలుగులో దర్శకుడు నభి ఏనుగుబాల దర్శకత్వం వహించిన టువంటి మసక్కలి అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు హీరో సాయి రొనక్.అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

 Vijay Devarakonda Release Pressure Cooker Trailer-TeluguStop.com

దీంతో హీరో సాయి రోనక్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా ఎవరికీ తెలియరాలేదు.అయితే తాజాగా సాయి రోనక్ ప్రెషర్ కుక్కర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో సాయి రోనక్ సరసన మళ్ళీరావా చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో అలరించిన టువంటి ప్రీతి అశ్రని నటిస్తోంది.

అయితే తాజాగా ఈ చిత్ర థియేట్రికల్  ట్రైలర్ నీ టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ నెల 8వ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలిపారు.

అయితే ఇప్పటికే చిత్రం లోని పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తయినట్లు దర్శకుడు తెలిపారు.అంతేగాక ఈ నెల 21వ తారీకున ఈ చిత్రం విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Telugu Pressurecooker, Lovervijay-Movie

అయితే ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ, విలక్షణ నటుడు తనికెళ్ల భరణి వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.అయితే తన మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయిన సాయి రోనక్  ఈచిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని తపిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube