విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా అవి నిరాశ పర్చుతూనే ఉన్నాయి.నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లుగా నిలిచాయి.
అయినా కూడా మనోడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఈయనకు ఉన్న క్రేజ్‌కు అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఈయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఆయనకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఏ పాటిదో చెప్పకనే చెబుతోంది.అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ఒక ద్విభాష చిత్రాన్ని విజయ్ చేస్తున్నాడు.దాంతో హిందీ ప్రేక్షకులు కూడా ఈయనపై ఆసక్తిని చూపిస్తున్నారు.విజయ్ దేవరకొండను బాలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో అనుసరిస్తున్నారు.అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 6 మిలియన్ల ఫాలోవర్స్‌ను చేరుకున్నాడు.ఇప్పటి వరకు ఏ సౌత్ స్టార్ హీరోకు కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఇన్‌స్టాలో లేరు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ట్రెండీగా ఉండటం వల్ల ఉత్తరాది వారు విజయ్‌ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు.ఉత్తరాది నెటిజన్స్ ఎక్కువగా ఫాలో అవుతున్న కారణంగానే చాలా స్పీడ్‌గా మహేష్.అల్లు అర్జున్‌లతో పాటు ఇతర స్టార్స్‌ను క్రాస్ చేశాడు.
పూరితో మూవీ పూర్తి అయ్యి వచ్చిన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.