ఇంటివాడైన విజయ్‌ దేవరకొండ

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఓవర్‌ నైట్‌లో స్టార్‌ హీరో అయ్యాడు.పెళ్లి చూపులు చిత్రం ముందు వరకు విజయ్‌ దేవరకొండ అంటే ఎవరికి పెద్దగా తెలియదు.

 Vijay Devarakonda Purchase A New House-TeluguStop.com

కాని ఎప్పుడైతే పెళ్లి చూపలు విడుదలైందో అప్పుడే మనోడి స్థాయి పెరిగింది.ఇక అర్జున్‌ రెడ్డితో స్టార్‌ అయ్యాడు.

గీత గోవిందం చిత్రంతో సూపర్‌ స్టార్‌ అయ్యాడు.మొన్నటి వరకు ఒక సాదారణ ఇంట్లో ఉంటూ వచ్చిన విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ నేటి నుండి ఒక రిచ్‌ హౌస్‌లోకి షిప్ట్‌ అయినట్లుగా తెలుస్తోంది.

ఫిల్మ్‌ నగర్‌లో ఒక ఖరీదైన భవనంను విజయ్‌ దేవరకొండ కొనుగోలు చేశాడట.దాదాపుగా ఏడున్నర కోట్లతో ఆ భవనంను విజయ్‌ దేవరకొండ కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

నేడు మంచి రోజు అవ్వడంతో కుటుంబ సభ్యులు మరియు కొందరు సన్నిహితుల సమక్షంలో గృహ ప్రవేశం కానిచ్చేశాడు.ఈ విషయాన్ని పెద్దగా బయటకు చెప్పకుండా మ్యానేజ్‌ చేశాడు.

అయినా కూడా రౌడీ గురించిన ఏ విషయం అయినా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది.ఆయనకు ఉన్న క్రేజ్‌ అలాంటిది.

ఫిల్మ్‌ నగర్‌లో ఇల్లు తీసుకుని సెటిల్‌ అయ్యావు మరి పెళ్లి ఎప్పుడు అంటూ రౌడీని నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube