'లవ్ స్టోరీ' సినిమాతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగుతున్న విజయ్!

టాలీవుడ్ రౌడీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.ఆయన నటుడిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు క్రేజీ హీరోగా యువత గుండెల్లో చోటు సంపాదించు కున్నాడు.

 Vijay Devarakonda Proudly Announces The Opening Of His First Theatre, Vijay Deva-TeluguStop.com

విజయ్ దేవరకొండ అటు సినిమాలు చేస్తూనే ఇటు వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టాడు.ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతొ టెక్స్ టైల్ బిజినెస్ స్టార్ట్ చేసి దానిని సక్సెస్ కూడా చేసాడు.

ఇక ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టనున్నాడు.ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ను తన సొంత ఊరు అయిన మహబూబ్ నగర్ లో AVD సినిమాస్ అనే పేరుతో స్టార్ట్ చేయబోతున్నారు.ఈ సందర్భంగా విజయ్ మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటలను బయట పెట్టాడు.

Telugu Avd Cinemas, Liger, Mahbubnagar, Puri Jagannadh-Movie

నా కెరీర్ శేఖర్ కమ్ముల గారి సినిమాతోనే స్టార్ట్ అయ్యింది.ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమా ‘లవ్ స్టోరీ’ తోనే నా థియేటర్ ఓపెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని విజయ్ తెలిపారు.లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24 న థియేటర్స్ లోకి రాబోతున్న విషయం తెలిసిందే.అదే రోజు విజయ్ మల్టీప్లెక్స్ థియేటర్ ఓపెన్ అవ్వబోతుంది.ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ విజయ్ లైగర్ సినిమా చేస్తున్నాడు.

Telugu Avd Cinemas, Liger, Mahbubnagar, Puri Jagannadh-Movie

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతుంది.మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్ ఇంకా పూరీ.ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ తన స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.

బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష స్పందన లభించింది.

ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube