విజయ్‌ దేవరకొండ క్రేజ్‌కు ఈ కోట్లే ప్రత్యక్ష సాక్ష్యం

విజయ్‌ దేవరకొండ హీరోగా కేవలం రెండు సినిమాలతో ఏకంగా సూపర్‌ స్టార్‌ రేంజ్‌ను దక్కించుకున్నాడు.అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడు.

 Vijay Devarakonda Produce The Meku Matrame Cheputha Movie-TeluguStop.com

ఈయన ఏం చేసినా కూడా ఫ్యాన్స్‌ ఆధరిస్తున్నారు, అభిమానిస్తున్నారు.విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ లెక్కలేనంత మంది ఉన్నారు.

ముఖ్యంగా లేడీస్‌ లో ఈ రౌడీ స్టార్‌ ఫాలోయింగ్‌కు పిచెక్కి పోవాల్సిందే.అంతటి మంచి గుర్తింపు ఉన్న విజయ్‌ దేవరకొండ ఇటీవలే మీకు మాత్రమే చెప్తా అనే చిత్రాన్ని నిర్మించాడు.

Telugu Arjun Reddy, Vijaymeku-

  ఈమద్య ప్రతి హీరో కూడా నిర్మాతగా మారుతున్నాడు.అదే క్రమంలో విజయ్‌ దేవరకొండ కూడా నిర్మాతగా మారేందుకు సిద్దం అయ్యాడు.ఈయన నిర్మాతగా మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

Telugu Arjun Reddy, Vijaymeku-

  మీకు మాత్రమే చెప్తా సినిమాను కేవలం మూడు నుండి మూడున్నర కోట్ల మద్య ఈయన నిర్మించాడు అంటున్నారు.మహా అంటే అయిదు కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చు చేశాడేమో.అంతకు మించి ఏమీ ఖర్చు అవ్వదు.

ఎందుకంటే ఆ సినిమాలో అంతా కొత్త వారు మరియు చాలా చిన్న బడ్జెట్‌ మూవీ.

Telugu Arjun Reddy, Vijaymeku-

  చిన్న మూవీ అయినా విజయ్‌ దేవరకొండ నిర్మించడం వల్ల పెద్ద సినిమా అయ్యింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం ఏకంగా 10 కోట్లకు మించి అమ్ముడు పోయిందట.ఇక శాటిలైట్‌ రైట్స్‌ను స్టార్‌ మా వారు 3.5 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.ఇక ప్రైమ్‌ వీడియో రైట్స్‌ను అమెజాన్‌ సంస్థ రెండు కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని చెబుతున్నారు.

మొత్తంగా 16 కోట్లకు పైగా ఈ చిత్రం అన్ని రైట్స్‌ ద్వారా దక్కించుకుంది.ఒక చిన్న బడ్జెట్‌ సినిమాకు ఇంత బిజినెస్‌ అంటూ అంతా ఆశ్చర్య పోతున్నారు.

కేవలం విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ కారణంగానే ఈస్థాయిలో బిజినెస్‌ జరిగింది.ఈ కోట్లు విజయ్‌ దేవరకొండ క్రేజ్‌కు నిదర్శణం అంటూ ఆయన అభిమానులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube