విజయ్ ప్రైవేట్ జెట్ హంగులు ఆర్భాటాలు ఎలా ఉన్నాయో తెలుసా.. ?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ.సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అతి తక్కువ సమయంలో హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు.కెరియర్ ప్రారంభంలో సపోర్టింగ్ రోల్స్ చేసే విజయ్.పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, మహానటి, గీత గోవిందం, నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో స్టార్ హీరోల సరసన చేరాడు.

 Vijay Devarakonda Privet Jet Specialities And Facts, Vijay Devarakonda, Vijay Devarakonda Private Jet, Private Jet Specialities, Liger Movie, Puri Jagannath, Pan India Movie, Tollywood,-TeluguStop.com

రౌడీస్టార్‌గా అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు.తన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నాడు.సినిమా కెరియర్‌లోనూ, బిజినెస్‌లోనూ దూసుకెళ్తున్నాడు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

 Vijay Devarakonda Privet Jet Specialities And Facts, Vijay Devarakonda, Vijay Devarakonda Private Jet, Private Jet Specialities, Liger Movie, Puri Jagannath, Pan India Movie, Tollywood, -విజయ్ ప్రైవేట్ జెట్ హంగులు ఆర్భాటాలు ఎలా ఉన్నాయో తెలుసా.. -Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విజయ్ ఒక ప్రైవేట్ జెట్‌ను తీసుకున్నాడనే వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.అయితే సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలకు ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి.

నాగార్జున, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా చాలా మందికి ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి.వీటిని తమ ప్రెస్టేజ్‌గా భావిస్తుంటారు.

ఈ వరుసలో విజయ్ దేవరకొండ కూడా చేరారు.విజయ్ కూడా ఒక ప్రైవేట్ జెట్‌ను తీసుకున్నాడు.

Telugu Liger, Pan India, Private Jet, Puri Jagannath, Tollywood-Telugu Stop Exclusive Top Stories

విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్ హంగుల విషయానికి వస్తే అత్యంత విశాలమైన, కన్నులు మిరుమిట్లుగొలిపే అద్భుతమైన ఇంటీరియర్ ని కలిగి ఉందట.ఈ జెట్ లో నాలుగు ప్రయాణికులు కూర్చొని చాల సౌకర్యవంతగా ఉండచ్చట.జెట్ లోపలి భాగంలో ఒక బెడ్ అలాగే ఒక సీటింగ్ ఏరియా వీటితో పాటు డైనింగ్ కి సరిపడా అన్ని వసతులు ఉన్నాయట.

Telugu Liger, Pan India, Private Jet, Puri Jagannath, Tollywood-Telugu Stop Exclusive Top Stories

ప్రస్తుతం విజయ్ పూరిజగన్నాథ్ దర్వకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

కాగా, విజయ్ సినిమాలతోపాటు బిజినెస్‌లోనూ రాణిస్తున్నాడు.అలాగే హీరో, ఫైటర్ సినిమాలు వరుసలో ఉన్నాయి.

లైగర్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.అలాగే ముంబైలోనూ తన బిజినెస్‌ను విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం లైగర్ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీ అయ్యాడు.కాగా, ఇప్పటికే లైగర్ విడుదలపై భారీ అంచనాలే పెరిగాయి.

లైగర్ సినిమా విడుదలతో విజయ్ దేవరకొండ రేంజ్ పాన్ ఇండియా మూవీ స్థాయికి చేరడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube