సూర్య సినిమాకి కనెక్ట్ అయిన రౌడీ స్టార్

డక్కన్ ఎయిర్ లైన్స్ సీఈఓ కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా సుధా కొంగర దర్శకత్వం సూర్య హీరోగా తెరకెక్కిన సినిమా ఆకాశం నీ హద్దురా.సురైపొట్టు టైటిల్ తో తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా టైటిల్ తో రిలీజ్ అయ్యింది.

 Vijay Devarakonda Praises Surya Soorarai Pottru Movie, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా రెండు బాషలలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కథనం చాలా నేచురల్ గా దర్శకురాలు సుధా కొంగర తెరపై ఆవిష్కరించారు.

విమర్శకుల ప్రశంసలు సైతం ఈ సినిమా సొంతం చేసుకుంది.ఈ సినిమా కథకి మూలకారకుడు కెప్టెన్ గోపీనాథ్ సైతం కథపై, అలాగే హీరో సూర్య పెర్ఫార్మెన్స్, సుధా కొంగర దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపించారు.

అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు.

ఇక టాలీవుడ్ క్రేజీ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఈ ఆకాశం నీ హద్దురా సినిమాకి బాగా కనెక్ట్ అయిపోయాడు.

దీనిపై తాజాగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.స్నేహితుల గ్యాంగ్ తో క‌లిసి సినిమా చూశా.నా స్నేహితుల్లో ముగ్గురు ఏడ్చారు.సూర్య త‌న‌లోని న‌ట‌నంతా దార‌పోశాడు.

మ‌రోవైపు నిర్మాత‌గా కూడా స్పూర్తిగా నిలిచాడు.డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర త‌న సినిమాల్లో అద్బుత‌మైన హీరోయిన్ల‌ను ఎక్క‌డి నుంచి తీసుకొస్తారోన‌ని ఆశ్చ‌ర్య‌మేసిందని విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ట్వీట్ చేశాడు.

మొత్తానికి సూర్య చాలా కాలం తర్వాత సాలిడ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు అభిమానులకి ఫుల్ ట్రీట్ ఇచ్చాడని అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాతో అమెజాన్ ప్రైమ్ కి సాలిడ్ హిట్ సౌత్ నుంచి అందిందనే మాట వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube