దేవరకొండ బ్రదర్స్ చదరంగం.. రీల్ కాదు రియల్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.గతకొద్ది కాలంగా సక్సెస్ ట్రాక్ తప్పిన ఈ హీరో పూరీతో కలిసి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

 Vijay Devarakonda Playing Chess With Anand Devarakonda-TeluguStop.com

ఇక ఈ సనిమా కోసం ఇప్పటికే ట్రెయినింగ్ కూడా తీసుకున్నాడు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ఇంటికే పరిమితం అయ్యారు.కాగా తారలు తమ కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతున్నారు.

ఈ జాబితాలో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయాడు.తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నాడు.

తాజాగా ఈ అన్నదమ్ములిద్దరు ఇంట్లో చదరంగం ఆడుతూ దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇలా ఇద్దరు హీరోలు కరోనా కారణంగా ఇంటికే అంటుకుపోవడంతో వారు ఇలా సమయాన్ని గడపడం చాలా సంతోషకరంగా ఉందని రౌడీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి కరోనా వైరస్ కారణంగా సెలెబ్రిటీలు ఇలా ఇళ్లకే అతుక్కుపోవడం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమవంతు బాధ్యతగా ఇంటిలోనే ఉండటం చాలా మంచి విషయం అని అందరూ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube