ఆ మంచి పనికి రౌడీ స్టార్‌ ప్రచారం  

Hero Vijay Devarakonda, Plasma Donation, Corona virus, Chiranjeevi, Vijay Devarakonda Campaign Plasma Donation - Telugu Chiranjeevi, Corona Virus, Hero Vijay Devarakonda, Plasma Donation, Vijay Devarakonda Campaign Plasma Donation

విజయ్‌ దేవరకొండ ఈమద్య కాలంలో కనిపించడమే చాలా గగనం అయ్యింది.కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్న విజయ్‌ దేవరకొండ అప్పుడప్పుడు మంచి కార్యక్రమాల కోసం, ప్రభుత్వం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల కోసం బయటకు వస్తున్నాడు.

 Vijay Devarakonda Plasma Donate Campaign

ఆమద్య లాక్‌ డౌన్‌ టైంలో మద్యతరగతి వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చిన విజయ్‌ దేవరకొండ ఆ తర్వాత పోలీసులు మాస్క్‌ ధరించేందుకు చేస్తున్న ప్రచారంలో భాగంగా మీడియా ముందుకు వచ్చాడు.ఇప్పుడు మరో మంచి పనితో ముందుకు వచ్చాడు.

కరోనా పేషంట్స్‌కు ట్రీట్‌మెంట్‌కు ఉపయోగపడే ప్లాస్మా దానం గురించి తెగ చర్చ జరుగుతుంది.కరోనా వైరస్‌ సోకి దానిని జయించిన వారి ప్లాస్మాతో మంచి ట్రీట్‌మెంట్‌ సాధ్యం అవుతుంది.

ఆ మంచి పనికి రౌడీ స్టార్‌ ప్రచారం-Movie-Telugu Tollywood Photo Image

అందుకే కరోనాను జయించిన వారిని ప్లాస్మా దానం చేసేందుకు పలువురు ప్రోత్సహిస్తున్నారు.ఇటీవలే చిరంజీవి మరియు రాజమౌళి కూడా ప్లాస్మా దానం గురించి మాట్లాడటం జరిగింది.ఇప్పుడు అదే విషయాన్ని యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తన అభిమానుల ముందుకు తీసుకు వచ్చాడు.

తెలంగాణ పోలీస్‌ శాఖతో కలిసి విజయ్‌ దేవరకొండ ప్లాస్మా దానం యొక్క గొప్పదనం తెలిసేలా ప్రచార పోస్టర్‌ను విడుదల చేశాడు.తనకు కరోనా వచ్చి క్యూర్‌ అయితే ఖచ్చితంగా నేను ప్లాస్మా దానం చేస్తానంటూ ప్రకటించాడు.ఈ విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా దానం అనేది అన్నింటి కంటే గొప్ప దానంగా విజయ్‌ దేవరకొండ పేర్కొన్నాడు.

తన అభిమానులు ఎవరైనా కరోనాను జయించిన వారు ఉంటే తప్పకుండా ప్లాస్మాను దానం చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు.

#Plasma Donation #Corona Virus #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Devarakonda Plasma Donate Campaign Related Telugu News,Photos/Pics,Images..