విజయ్‌ దేవరకొండ అందుకు ఒప్పుకుంటున్నాడా... తెలివైన నిర్ణయం

‘అర్జున్‌ రెడ్డి’, ‘గీతాగోవిందం’ చిత్రాలతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుని యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ.వరుస సక్సెస్‌లతో విజయ్‌ క్రేజీ స్టార్‌గా మారిపోయిన విజయ్‌ ప్రస్తుతం తెలుగులో ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు.

 Vijay Devarakonda Planning About His Bollywood Debut-TeluguStop.com

అయితే తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తున్న విజయ్‌కు చాలా తక్కువ కాలంలోనే బాలీవుడ్‌ ఆఫర్లు వస్తున్నాయి.అతిలోక సందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ విజయ్‌ యాటీట్యూడ్‌ అంటే ఇష్టమని, ఈయనతో నటించడానికి సముఖత వ్యక్తం చేసింది.

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలయిన కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌ మరియు యష్‌రాజ్‌ ప్రొడక్షన్‌ విజయ్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబర్చుతున్నారు.అయితే ఇవేవి కావని విజయ్‌ 1983 వరల్డ్‌కప్‌కు సంబంధించిన సినిమాలో ఒక చిన్న కేరక్టర్‌ ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే పుకార్లు వినిపిస్తున్నాయి.కానీ అవన్నీ వట్టి అబద్దాలే.పెద్ద పెద్ద నిర్మాణ సంప్థలే ఈయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతుంటే ఇక చిన్న కేరక్టర్‌ ద్వారా బాలీవుడ్‌ రంగ ప్రవేశం చేయడం అవాస్తవం.

ఇలాంటి విషయాల్లో విజయ్‌కు మంచి పట్టు ఉంది.

విజయ్‌ సినిమాల పరంగా చాలా తెలివైన నిర్ణయం తీసుకుంటాడు.అందుకే వరుస హిట్లు అతి తక్కువ కాంలో వచ్చి పడుతున్నాయి.ఇక బాలీవుడ్‌ ఎంట్రీ గురించి కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు.

అందుకే ధర్మ మరియు యష్‌రాజ్‌ ప్రొడక్షన్‌ సంస్థలతో డీలింగ్స్‌ కూడా జరుపుతున్నాడు.విజయ్‌ యాటీట్యూడ్‌కు ఫిదా అయిన బాలీవుడ్‌ బడా నిర్మాతలు సైతం విజయ్‌ కోసం ఎదురుచూసేలా యాటీట్యూడ్‌ చూపిస్తున్నాడు.

సదరు నిర్మాణ సంస్థలు ఎప్పటి నుండో విజయ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఈ రెండు నిర్మాణ సంస్థలతో మొదటగా దేని ద్వారా పరిచయం కాబోతున్నాడు అనేది క్లారిటీ లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube