రౌడీ స్టార్‌ మరీ అతి ప్రయోగం చేస్తున్నాడా.. కాస్త ఆలోచించు పూరి

పెళ్లి చూపులు సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ ప్రయోగాత్మకంగా చేసిన అర్జున్‌ రెడ్డి సెన్షేషనల్‌ సూపర్‌ హిట్‌ గా నిలిచిన విషయం తెల్సిందే.అర్జున్‌ రెడ్డి తర్వాత టాలీవుడ్‌ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అర్జున్‌ రెడ్డిగా మంచి గుర్తింపును విజయ్‌ దేవరకొండ దక్కించుకున్నాడు.

 Vijay Devarakonda Own Dubbing In Hindi Version Of Liger, Vijay Devarakonda, Lige-TeluguStop.com

ఇప్పుడు విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా మూవీని పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.లైగర్‌ టైటిల్‌ తో రూపొందుతున్న లైగర్‌ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా లైగర్‌ ఉండటంతో పాటు హిందీ ప్రేక్షకులు వందల కోట్లు కురిపించేలా సినిమా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ఈ ఏడాది లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాను.

అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా హిందీ వర్షన్‌ కోసం విజయ్‌ దేవరకొండ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా తెలుగు తో పాటు హిందీలో కూడా చిత్రీకరించినట్లుగా సమాచారం అందుతోంది.రౌడీ స్టార్‌ ను ఉత్తరాది ప్రేక్షకులు ఎలా ఆధరిస్తారో ఇంకా క్లారిటీ లేదు.

అయినా కూడా విజయ్‌ దేవరకొండ మాత్రం హిందీలో డబ్బింగ్‌ చెప్పేందుకు సిద్దం అవుతున్నాడు.హిందీలో హీరోలు డబ్బింగ్‌ చెప్పాలంటే కాస్త కష్టమైన విషయమై.అయినా కూడా ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ ప్రత్యేక శ్రద్ద పెట్టి డబ్బింగ్‌ ను చెప్పబోతున్నాడు.మరి ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో అనేది అనుమానంగా ఉంది.

విజయ్‌ తో డబ్బింగ్‌ చెప్పించే సమయంలో పూరి కాస్త ఆలోచిస్తే బెటర్‌ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అంటున్నారు.

Telugu Ananya Pande, Charmi Kaur, Hindi, Liger, Ups, Puri Jagannath-Latest News.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube