'ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి ....?' ఫారిన్ గర్ల్ ఫ్రెండ్ గురించి విజయ్ దేవరకొండ ఏమన్నారంటే.?     2018-10-07   11:59:20  IST  Sainath G

ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే హీరో విజయ్ దేవరకొండ. అతను తాజాగా నటించిన చిత్రం నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన విజయ్ అనేక అంశాలపై మాట్లాడారు. ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత నటనను మానేసి దర్శకత్వం వైపు వెళ్లాలని అనుకున్నాననీ ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు. వరుసవిజయాలు రావడంతో ఆనందంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా కొద్దిరోజులుగా విజయ్ ఓ ఫారెన్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫొటోల్లో విజయ్ ఏకంగా ఆ అమ్మాయిని ముద్దు పెడుతూ కనిపించడంతో టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లియర్ గా ఈ జంట సెల్ఫీలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ సన్నిహితులు మాత్రం ఇవి విజయ్ సినిమాలోకి రాకముందు ఫోటోలని, అప్పుడేవో ఫోటో షూట్స్ లో పాల్గొన్నాడని కవర్ చేసే ప్రయత్నం చేశారు.

Vijay Devarakonda opens About Foreign GirlFriend-NOTA Movie,Vijay Devarakonda

‘నోటా’ ప్రమోషన్లలో భాగంగా విజయ్ ఈ విషయమై మాట్లాడాడు. మీడియాలోకి వచ్చిన ఫొటోలో అమ్మాయితో కలిసి ఉన్నది తానే అని విజయ్ ఒప్పుకోవడం విశేషం.

‘‘ఆ ఫోటో లో వున్నది నేనే . అది మార్ఫింగ్ చేశారు.. అందులో వుంది నేను కాదు అని చెప్పను. ఐతే ఆ ఫోటో రెండు సంవత్సరాల ముందుది. అందులో ఉన్న అమ్మాయి చాలా మంచిది. మీరు ఈ విషయాన్ని తొందరగా మర్చిపోవాలని అనుకుంటున్నాను’’ అని మీడియా వాళ్లతో అన్నాడు విజయ్.బెల్జియం దేశానికి మిలానే.. విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేయడం చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ మాదిరి విజయ్ దేవరకొండ కూడా విదేశీ అమ్మాయినే పెళ్లిచేసుకునేటట్టు ఉన్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.ఆ అమ్మాయి గురించి మరిచిపోండి అంటే ఏమని అర్ఝం? ఆ మాటల ద్వారా సందిగ్ధతను మరింత పెంచాడు విజయ్. ఈ ప్రేమాయణం సంగతేమో కానీ.. తనకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం లేదని విజయ్ స్పష్టం చేశాడు.