నెక్స్ట్ 'పవర్ స్టార్' అనిపించుకునేందుకే..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా టైటిల్ ని ఖుషి అని పెట్టి పెద్ద చర్చకే దారి తీశాడు.శివ నిర్వాణ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా టైటిల్ గా ఖుషి అని పెటారు.

 Vijay Devarakonda Next Power Star, Kushi , Next Powerstar, Pawan Kalyan, Pawan K-TeluguStop.com

అయితే ఈ సినిమాకు ఖుషి అనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది.మరే టైటిల్ దీనికి సూట్ అవదా అంటే.

దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.లవ్ స్టోరీస్ లో ఖుషి ఒక ట్రెండ్ సెట్టర్.

పవర్ స్టార్ ఫ్యాన్స్ ని కూడా ఈ సినిమా తో ఖుషి చేసేలా విజయ్ అండ్ టీం ఆ టైటిల్ పెట్టి ఉండొచ్చని అంటున్నారు.ఇక మరో కామెంట్ ఏంటంటే తెలంగాణా తొలి స్టార్ హీరోగా ఇప్పుడున్న స్టార్స్ కి మంచి పోటీ ఇచ్చే సత్తా ఉన్న స్టార్ గా విజయ్ దేవరకొండ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక ఇదే క్రేజ్ తో నెక్స్ట్ పవర్ స్టార్ తానే అని అనిపించుకునేందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి టైటిల్ వాడి ఉండొచ్చని అంటున్నారు.ఈ రెండు వాదనల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది పక్కన పెడితే విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరు కలిసి చేసే లవ్ స్టోరీకి ఖుషి అనే టైటిల్ పెట్టడం సినీ లవర్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటూ శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ ఖుషి పవన్ కళ్యాణ్ ఖుషి రేంజ్ లో హిట్ అవ్వాలని కోరుతున్నారు సినీ ప్రేక్షకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube