మైత్రీకి బ్యాలెన్స్ ఉన్న విజయ్ దేవరకొండ! పూరీ తర్వాత అదేనా  

Vijay Devarakonda Next Movie In Mytri Movie Makers - Telugu Director Sujith, Maruti, Mytri Movie Makers, Tollywood, Vijay Devarakonda Next Movie

ఈ మధ్యకాలంలో అందరికంటే తక్కువ సినిమాలు చేసి అందరికంటే వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో అంటే వెంటనే విజయ్ దేవరకొండ పేరు చెబుతారు.అయితే ఈ కుర్ర హీరో రెండేళ్ళ క్రితం గీతాగోవిందం, టాక్సీవాలాతో జోష్ చూపించిన చివరిగా చేసిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారిపోయాయి.

Vijay Devarakonda Next Movie In Mytri Makers - Telugu Director Sujith Maruti Tollywood

తాజాగా రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా దేవరకొండ కెరియర్ లో అతిపెద్ద డిజాస్టర్ అని చెప్పాలి.ఈ కుర్ర హీరో దర్శకుడు తీయాలనుకున్న కథలో కూడా వేలు పెట్టి ఇష్టానుసారంగా తనకి సరిపోయే విధంగా మార్చేసుకుంటూ ఉండటంతో సినిమాలు ఇలా ఫ్లాప్ అవుతున్నాయి అనే రూమర్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

దర్శకులు చెప్పినట్లు కాకుండా సొంత ఐడియాలు ఉపయోగించి దెబ్బ తింటూ ఉన్నాడని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కోసం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వెయిట్ చేస్తుంది.ఈ ప్రొడక్షన్ లో గతంలో విజయ్ దేవరకొండతో హీరో అనే సినిమా మొదలెట్టి మధ్యలో ఆపేశారు.

అయితే విజయ్ దేవరకొండ అగ్రిమెంట్ మైత్రీ వారితో ఉందని తెలుస్తుంది.ఈ అగ్రిమెంట్ ప్రకారం పూరీ సినిమా తర్వాత ఆ బ్యానర్ లో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో విజయ్ కోసం మారుతి, సాహో ఫేం సుజిత్ ఇప్పటికే నిర్మాతలకి కథలు చెప్పడం జరిగిందని, వారి నుంచి గ్రీన్ సిగ్నల్స్ కూడా వచ్చాయని సమాచారం.దేవరకొండ కూడా ఈ కథలు విని ఎవరిని ఫైనల్ చేస్తే వారితో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.

తాజా వార్తలు

Vijay Devarakonda Next Movie In Mytri Movie Makers-maruti,mytri Movie Makers,tollywood,vijay Devarakonda Next Movie Related....