వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌గా రౌడీ  

Vijay Devarakonda New Movie Title Is World Famous Lover-dear Comrade,geetha Govindham,tollywood Movie,vijay Devarakonda

‘అర్జున్‌ రెడ్డి|, ‘గీతా గోవిందం’ చిత్రాలతో క్రేజీస్టార్‌గా మారిపోయిన విజయ్‌ ఆ తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’ తో కాస్త నిరాశ పర్చిన విషయం తెల్సిందే.ఈసారి మంచి హిట్‌తో తన రౌడీ అభిమానులకు కానుక ఇవ్వడానికి ప్లాన్‌ చేస్తున్నాడు.విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే మొదలయింది.కాగా తాజాగా టైటిల్‌ను ఖరారు చేశారు.టైటిల్‌తోనే విజయ్‌ అభిమానులను ఖుషీ చేశాడు.లవర్‌ బాయ్‌గా నటించిన సినిమాలే విజయ్‌కు సక్సెస్‌ను అందిస్తాయి.దాంతో ఈసారి టైటిల్‌తోనే లవర్‌గా రాబోతున్నాడు.

Vijay Devarakonda New Movie Title Is World Famous Lover-dear Comrade,geetha Govindham,tollywood Movie,vijay Devarakonda-Vijay Devarakonda New Movie Title Is World Famous Lover-Dear Comrade Geetha Govindham Tollywood

క్రాంతి మాధవ, విజయ్‌ల కాంబోకు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా టైటిల్‌ను ఖరారు చేశారు.తాజాగా టైటిల్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.రౌడీస్టార్‌ నటిస్తున్న ఈ తొమ్మిదో చిత్రానికి మంచి టైటిల్‌నే ఎంపిక చేశారు.ఈ చిత్రంలో విజయ్‌ సరసన ముద్దుగుమ్మ రాశిఖన్నా నటిస్తోంది.ఈ సినిమాతో పాటే విజయ్‌ పూరీ దర్శకత్వంలో కూడా నటించనున్నాడు.పూరీ, విజయ్‌ల సినిమాకు కూడా ప్రీ ప్రొడక్షన్‌ పనులు చకాచకా జరుగుతున్నాయి.

Vijay Devarakonda New Movie Title Is World Famous Lover-dear Comrade,geetha Govindham,tollywood Movie,vijay Devarakonda-Vijay Devarakonda New Movie Title Is World Famous Lover-Dear Comrade Geetha Govindham Tollywood