చిరంజీవి తర్వాత నేనే హీరో అంటున్న విజయ్ దేవరకొండ  

మెగాస్టార్ చిరంజీవి మూవీ టైటిల్ తో మళ్ళీ వస్తున్న విజయ్ దేవరకొండ. .

Vijay Devarakonda New Movie Started With Anand Direction-

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ కెరియర్ లో నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ తో 50 కోట్ల క్లబ్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ ఇమేజ్ ఇప్పుడు పీక్ లో ఉంది అని చెప్పాలి.ప్రస్తుతం డియర్ కామ్రేడ్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధం అయిన విజయ్, తన నెక్స్ట్ సినిమాలని క్రాంతి మాధవ్ దర్శకత్వంలో, అలాగే యువ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కించే పనిలో ఉన్నాడు..

Vijay Devarakonda New Movie Started With Anand Direction--Vijay Devarakonda New Movie Started With Anand Direction-

ఇప్పటికే క్రాంతి మాధవ్ సినిమాని స్టార్ట్ చేసిన విజయ్ త్వరలో దాని షూటింగ్ మొదలెట్టనున్నాడు.మరో వైపు ఆనంద్ దర్శకత్వంలో రేస్ ల నేపధ్యంలో త్రిభాషా చిత్రం తాజాగా ఓపెనింగ్ జరుపుకుంది.

ఈ సినిమాలో విజయ్ కి జోడీగా మాళవిక నటిస్తుంది.ఇదిలా ఉంటే మెగాస్టార్ కెరియర్ తొలినాళ్ళలో హీరో టైటిల్ తో సినిమా చేసాడు.ఈ సినిమా అప్పట్లో అంతగా ఆకట్టుకోలేదు.

ఇక నితిన్ కూడా హీరో టైటిల్ తో తన కెరియర్ లో సినిమా చేసాడు.అది కూడా డిజాస్టర్ అయ్యింది.మరల ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరో టైటిల్ తో మళ్ళీ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నాడు.

మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ ఆవ్తుంది అనేది చూడాలి.