రౌడీ బాయ్స్ ఫంక్షన్.. నయా లుక్ లో అదరగొట్టిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda New Look Rowdy Boys Movie Event

విజయ్ దేవరకొండ. తెలంగాణ నుంచి అతి తక్కువ కాలంలో టాప్ హీరోగా ఎదిగిన వ్యక్తి.

 Vijay Devarakonda New Look Rowdy Boys Movie Event-TeluguStop.com

చేసింది కొద్ది సినిమాలే అయినా ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కుర్రాడు.తన మార్క్ నటనతో అతికొద్ది కాలంలోనే అత్యద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు.

రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ పెళ్లి చూపులు, గీత గోవిందం, అర్జున్ రెడ్డితో కనీ వినీ ఎరుగన తీరిలో క్రేజ్ సంపాదించుకున్నాడు.అంతేకాదు.

 Vijay Devarakonda New Look Rowdy Boys Movie Event-రౌడీ బాయ్స్ ఫంక్షన్.. నయా లుక్ లో అదరగొట్టిన విజయ్ దేవరకొండ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వరుస ఆఫర్లతో వరుస సినిమాలు చేస్తూనే పలు వ్యాపారాల్లోకి కూడా అడుగు పెడుతున్నాడు.కొంత కాలం క్రింత రౌడీ పేరుతో ఫ్యాషన్ ఫీల్డ్‌ లోకి వచ్చాడు.

యూత్ కు ఫ్యాషన్ గా ఉంటే దుస్తులను ఈ కంపెనీ తయారు చేస్తోంది.

తాజాగా ఈ యంగ్ హీరో.

మరో కొత్త రంగంలోకి కూడా అడుగు పెట్టాడు.ఏషియన్ సినిమాస్ తో కలిసి మల్టీఫ్లెక్సుల వ్యాపారంలో కాలుమోపాడు.

తాజాగా పాలమూరులోథియేటర్ కూడా నిర్మించాడు.ఇటీవలే అది ప్రారంభం అయ్యింది.

అర్జున్ రెడ్డితో మాస్ హీరోగా మారిన ఈ కుర్రాడు ప్రస్తుతం ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు.టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్నాడు.

బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

దీంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.

Telugu Ananya Panday, Liger, Mike Tyson, Prui Jagannath, Rowdy Boys Movie Event, Rowdy Boys Second Song Release, Rowdy Star, Tollywood, Vijay Devarakonda, Vijay Devarakonda Look-Movie

తాజాగా జరిగిన రౌడీ బాయ్స్ సినిమా సెకెండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు విజయ్ దేవరకొండ గెస్టుగా వచ్చాడు.ఈ సందర్భంగా ఆయన వేసుకున్న డ్రెస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఆయన లేటస్ట్ డ్రెస్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జీరో టాలరెన్స్ గ్యాంగ్‌స్టర్ స్వెట్ టీషర్ట్‌ లో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

#Rowdy #Rowdy #Prui Jagannath #Rowdy #Ananya Panday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube