ఐతే విజయ్‌ దేవరకొండ తదుపరి సినిమా అది కాదా?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వం లో లైగర్‌ సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన విషయం తెలిసిందే.దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆ సినిమా షూటింగ్ జరిగింది.

 Vijay Devarakonda New Look And New Movie Hot Topic Details, Hero Vijay Devarakon-TeluguStop.com

విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా దాదాపు గా 2 సంవత్సరాల పాటు అడ్డు పడింది.ఎట్టకేలకు షూటింగ్ ముగియడం తో అభిమానులు ఆనందంగా సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.

ఆగస్టు లో సినిమా విడుదల అవుతుందని ఇప్పటికే అధికారికం గా ప్రకటించారు.పూరి జగన్నాథ్ సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది.

ఆ సినిమా లో కూడా విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

త్వరలోనే ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్నారు.

ఈ సమయం లో విజయ్ దేవరకొండ న్యూ లుక్ లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

జుట్టు గడ్డం పెంచుకుని తిరిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు చాలా నీట్ గా క్లీన్ గా కనిపిస్తున్నాడు.విజయ్ దేవరకొండ తదుపరి సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో అయితే కచ్చితం గా రఫ్ లుక్ లో మళ్లీ ఎక్కువ జుట్టు గడ్డం తో కనిపించాలి.

కానీ విజయ్ దేవరకొండ న్యూ లుక్ చూస్తుంటే తదుపరి సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో కాదేమో అనిపిస్తుంది.

శివ నిర్వాన దర్శకత్వం లో ఒక సినిమా లేదా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటు వార్తలు వస్తున్నాయి.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు అతి త్వరలోనే ప్రారంభమవుతాయని అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తి ఉన్న సమయంలో విజయ్ దేవరకొండ న్యూ లుక్ చర్చనీయాంశంగా మారింది.విజయ్ దేవరకొండ న్యూ లుక్ చూస్తుంటే ఈయన ఎవరి దర్శకత్వంలో నటించడం కోసం ఇలా మారేది అనేది క్లారిటీ రావడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube