విజయ్‌ దేవరకొండ మామూలోడు కాదు ఏకంగా ముగ్గురు సూపర్‌ స్టార్స్‌ను దించేశాడు  

Dear Comrade Movie Special With 3 Stars-

విజయ్‌ దేవరకొండ తన సినిమాల కథ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటాడో, మేకింగ్‌ విషయంలో కూడా అంతకు మించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు.ఇక విడుదల సమయంలో ప్రమోషన్స్‌ విషయంలో మరింత శ్రద్ద పెట్టి మరీ మొత్తం తానై ఇన్వాల్వ్‌ అయ్యి మరీ ప్రమోషన్స్‌ చేస్తాడు.ప్రస్తుతం ఈయన డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని ఏ స్థాయిలో అగ్రెసివ్‌గా ప్రమోట్‌ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం.ఇప్పటి వరకు ఏ హీరో కూడా సినిమా ప్రమోషన్‌ కోసం మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌ను నిర్వహించలేదు.

Dear Comrade Movie Special With 3 Stars- Telugu Tollywood Movie Cinema Film Latest News Dear Comrade Movie Special With 3 Stars--Dear Comrade Movie Special Song With 3 Stars-

మొదటి సారి విజయ్‌ దేవరకొండ చేస్తున్నాడు.

నాలుగు భాషల్లో విడుదల కాబోతున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం కోసం అదే స్థాయిలో ప్రమోషన్స్‌ చేస్తూ ఈయన అన్ని భాషల్లో కూడా అంచనాలు కల్పిస్తున్నాడు.కన్నడ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు కేజీఎఫ్‌ తో సూపర్‌ స్టార్‌ అయిన యష్‌ను తీసుకు వచ్చాడు.ఇక తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు యూత్‌ క్రేజీ హీరో విజయ్‌ సేతుపతిని రంగంలోకి దించి పాట పాడించాడు.ఇక మలయాళ ప్రేక్షకుల కోసం దుల్కర్‌ సల్మాన్‌ను రంగంలోకి దించాడు.

డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలోని ఒక అంతం సాంగ్‌ను తెలుగు కోసం విజయ్‌ దేవరకొండ, మలయాళం కోసం దుల్కర్‌ సల్మాన్‌, తమిళం కోసం విజయ్‌ సేతుపతి పడుతున్నారు.ఈ ముగ్గురు స్టార్స్‌ పాడిన పాట సినిమాపై మూడు భాషల ప్రేక్షకుల్లో కూడా అంచనాలను ఆకాశానికి పెంచుతున్నాయి.మొత్తానికి విజయ్‌ దేవరకొండ తనదైన తెలివితో సినిమాను విభిన్నంగా ప్రమోట్‌ చేస్తున్నాడు.నాలుగు భాషల్లో కూడా ఈ చిత్రం దుమ్ము రేపే వసూళ్లను దక్కించుకోవడం ఖాయంగా సినీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండకు రష్మిక జతగా నటించింది.మైత్రి మూవీస్‌ వారు నిర్మించిన ఈ చిత్రంకు భరత్‌ కమ్మ దర్శకత్వం వహించాడు.